బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

18-11-2024 సోమవారం ఫలితాలు - ఆ రాశివారికి అదృష్టం కలిసివస్తుంది...

astro8
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
పరిచయాలు బలపడతాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య అకారణ కలహం. పనులు సాగవు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఉభయులకూ చక్కని సలహాలిస్తారు. పనులు సానుకూలమవుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. మీ కష్టం వేరొకరికి కలిసివస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. వేడుకకు హాజరవుతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అన్యమస్కంగా గడుపుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కుంటారు. ఆప్తులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శుభవార్త వింటారు. యత్నాలు ఫలిస్తాయి. బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. పనులు త్వరితగతిన సాగుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. వస్త్రప్రాప్తి, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. పిల్లల మొండితనం అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. పట్టుదలతో శ్రమించండి. ఆత్మీయుల హితవు మీపై సత్ ప్రభావం చూపుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. స్థల వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. ప్రయాణం విరమించుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. గృహంలో సందడి నెలకొంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఆశించిన పదవులు దక్కవు. వివాదాలకు దిగవద్దు. పనులు ఒక పట్టాన సాగవు. ఆహ్వానం అందుకుంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం సాధ్యం. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు విపరీతం. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ధార్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అనుకున్నది సాధిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. అవకాశాలు అందిపుచ్చుకుంటారు. పొగిడేవారితో జాగ్రత్త. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. ఖర్చులు విపరీతం. కీలక పత్రాలు అందుకుంటారు. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. దైవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు.