మంగళవారం, 23 జులై 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

తేదీ 20-01-2023 శుక్రవారం దినఫలాలు - గౌరిదేవిని ఆరాధించినా మనోసిద్ధి..

astro4
మేషం :- సొంతంగా వ్యాపారం, పరిశ్రమలు, సంస్థల స్థాపనలకు యత్నాలు మొదలెడతారు. దైవసేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. ఎదుటి వారిని తక్కువ అంచనా వేయటం మంచిది కాదు అని గమనించండి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
వృషభం :- సమావేశానికి ఏర్పట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ప్లీడర్లకు తమ క్లయింట్ల లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు. 
 
మిథునం :- కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. గృహం కొనుగోలు ప్రయత్నంలో ఉన్నవారికి పనులు వేగంగా సాగుతాయి. డాక్టర్లు శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. అధైర్యం వదిలి ధైర్యంగా ముందుకు సాగి విజయం సాధించండి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి.
 
కర్కాటకం :- ఆదాయ వ్యయాలలో ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తారు. మీ వృత్తికి సంబంధించిన వ్యవహారాలను శ్రద్ధగా మలచుకోవడం వల్లనే వాటికి పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం కొంత ఆందోళన కలిగించినా శాంతిగానే ఉంటుంది. పై చదువులకై చేయుప్రయత్నాలలో జయం చేకూరగలదు. విలాస జీవితాలు సాగుతాయి.
 
సింహం :- మీ బంధవులను సహాయం అర్థించేబదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. గత కొంత కాలంగా కుటుంబంలోని వివాదాలు తొలగిపోతాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. మీ భవిష్యత్తుకు ఉపయోగపడేటు వంటి స్నేహితులు మీకు కొత్తగా పరిచయం అవుతారు. ఆరోగ్యంలో మెళుకువ వహించండి.
 
కన్య :- భార్య, భర్తల మధ్య అభిప్రాయభేదాలు చోటుచేసుకుంటాయి. పూర్వపు అప్పులు కొన్ని తీర్చెదరు. కోర్టు వ్యవహారములు, ఇతర వ్యవహారముల యందు వాయిదాలు శ్రేయస్కరం. విద్యార్థులకు క్రీడలు, ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ, సేవా, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
తుల :- వృత్తి, వ్యాపారాల వారికి అటంకాలు తొలగిపోతాయి. బదిలీలు గురించి ఓ నిర్ణయంతీసుకుంటారు. పాత బాకీలు అనుకోకుండా 
వసూలవుతాయి. రచయితలకు పత్రికా రంగంలోని వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రింటింగు, స్టేషనరీ రంగాలవారికి లాభదాయకం.
 
వృశ్చికం :- కోళ్ళ, మత్స్య, మాంస వ్యాపారులకు పురోభివృద్ధి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యస్థితి కొంత మెరుగుపడుతుంది. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. సాహిత్య సదస్సులలోను, బృంద కార్యక్రమాల్లోను పాల్గొంటారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. ఇతరుల విషయాలలో తలదూర్చడం వలన మాటపడక తప్పదు.
 
ధనస్సు :- పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ప్రైవేటు సంస్థలలోవారు, పనిలో ఏకాగ్రత వహించలేక పోవుట వలన అధికారులతో మాట పడవలసివస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. భార్యా, భర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. దైవ, సేవా పుణ్యకార్యక్రమాలలో పాల్గోంటారు.
 
మకరం :- గతంలో మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలలో వారికి అభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్తుల కార్యదీక్ష, పట్టుదలకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. రాబడికి మించిన ఖర్చులు, చెల్లింపుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. ప్రేమా అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
 
కుంభం :- శాస్త్ర, సాంకేతిక, క్రీడా రంగాల వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టునపుడు మెళుకుం అవసరం. ఏజెంట్లు, మార్కెటింగ్ రంగాల వారి టార్గెట్లు పూర్తి కాగలవు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. విద్యార్థులు తోటివారితో సఖ్యతగా మెలగవలసి ఉంటుంది.
 
మీనం :- పత్రిక, వార్తా మీడియా రంగాల వారికి ఆశాజనకం. ప్రతి వ్యవహారం కలిసిరావటంతో మీలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు పరిష్కార దిశగ సాగుతాయి.