గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

19-01-2023 - గురువారం దినఫలాలు - వినాయకుడిని ఆరాధించినయ...

astro3
మేషం :- మీ కళత్ర వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. స్త్రీల కోరికలు నెరవేరకపోవటంతో కుటుంబంలో చికాకులు చోటుచేసుకుంటాయి. చిట్స్, ఫైనాన్సు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం. 
 
వృషభం :- సంఘంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం పొందుతారు. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. సంఘంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం పొందుతారు. స్త్రీలకు బంధువర్గాలతో సఖ్యత నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. విద్యార్థుల ఆలోచనలు పక్కదోవ పట్టే ఆస్కారం ఉంది.
 
మిథునం :- చేపట్టిన పనులలో అవాంతరాలెదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. పట్టుదలతో శ్రమించినగాని పనులు పూర్తి కావు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. రావలసిన బాకీల వసూలులో శ్రమ, ప్రయాసలు తప్పవు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చటానికి మరి కొంత సమయం పడుతుంది. 
 
కర్కాటకం :- బ్యాంకింగ్ వ్యవహరాలు, ప్రయాణాల్లో మెలకువ వహించండి. అనుకున్న పనులు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఉమ్మడి వ్యాపారాలు ప్రగతి పథంలో సాగుతాయి. షేర్ మార్కెట్ రంగాల వారికి నిరుత్సాహం తప్పదు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. పత్రికా రంగంలోని వారికి సదావకాశాలు లభిస్తాయి. 
 
సింహం :- ఒక వ్యవహారం నిమిత్తం కొత్త ప్రదేశానికి ప్రయాణం చేయవలసివస్తుంది. కుటుంబ, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆడిటర్లకు, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. స్త్రీలకు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది.
 
కన్య :- ఏదైనా అమ్మకానికై చేయుప్రయత్నం వాయిదా వేయడం మంచిది. మిర్చి, పసుపు, నూనె, అపరాలు వ్యాపారులకు, స్టాకిస్టులకు మెలకువ అవసరం. ఇంటా బయటా ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. మీ శ్రీమతి లేక శ్రీవారి వైఖరిలో మార్పు వస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులు గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి.
 
తుల :- నిర్మాణ పనులలో పనివారలతో మెళకువ వహించండి. స్త్రీలకు కొత్త వ్యాపకాలు, ఆలోచనలు స్ఫురిస్తాయి. దూర ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు కలసిరాగలదు. అనుకోని ఖర్చులు, ఇతరత్రాచెల్లింపులు మీ ఆర్థికస్థితికి అవరోధంగా ఉంటాయి.
 
వృశ్చికం :- ప్రైవేటు సంస్థల్లో వారు అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించవలసి ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉన్నా మీ అవసరాలు నెవవేరుతాయి. ఎదుటివారితో ఆచితూచి సంభాషించండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. మిత్రులతో కలిసి వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు.
 
ధనస్సు :- కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు తప్పవు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థుల తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. సోదరీ, సోదరులలో అవగాహన లోపం అధికమవుతుంది.
 
మకరం :- కోర్టు వ్యవహారాల నిమిత్తం ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. పాతమిత్రుల కలయికతో మీలో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి అధికమవుతుంది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుత ఆర్థికస్థితి కొంత మెరుగనిపిస్తుంది. దూరప్రయాణాలలో వస్తువులపట్ల ఏకాగ్రత చాలా అవసరం.
 
కుంభం :- వృత్తుల వారికి కలిసిరాగలదు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. దైవకార్యం, విందుల్లో పాల్గొంటారు. రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
 
మీనం :- మీ ఆలోచనల్లో కొంత మార్పు వస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. మీ ఉన్నతిని చాటుకోవాలనే ఉద్దేశ్యంతో ధనం బాగుగా ఖర్చు చేస్తారు. వాణిజ్య ఒప్పందాలు, నగదు చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు.