శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

18-01-2023 - బుధవారం దినఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన...

astro2
మేషం :- కోర్టు వ్యవహరాల్లో ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు ఒత్తిడి, చికాకులు తప్పవు. అయిన వారి కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. వ్యాపారాల్లో నష్టాలు తొలగి క్రమేణా లాభాలు గడిస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఉద్యోగ, వివాహ యత్నాలు ఫలిస్తాయి.
 
వృషభం :- విద్యార్థుల్లో ఏకాగ్రత లోపం, మందకొడితనం వల్ల మందలింపులు తప్పవు. అనుకున్నపనుల్లో అవాంతరాలను అధికమిస్తారు. స్త్రీలపై సెంటిమెంట్లు, పొరుగువారి మాటల ప్రభావం అధికం. ఆకస్మిక విందు భోజనం, ప్రయాణం వంటి పరిణామాలున్నాయి. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది.
 
మిథునం :- ధనవ్యయం విపరీతంగా ఉన్నా సార్థకత ఉంటుంది. నూతన కాంట్రాక్టుల గడుపు పెంపులకు అనుకూలం. ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం క్షేమదాయకం. ఉద్యోగస్తులు అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. బంధువులతో సఖ్యత, రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. 
 
కర్కాటకం :- వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఖర్చులు అధికమైనా ఎంతో కొంతపొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. స్త్రీలకు అస్వస్థత, నీరసం వంటి చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. మీ రాక బంధుమిత్రులకు సంతోషం కలిగిస్తుంది.
 
సింహం :- భాగస్వామిక చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. పరిస్థితులు అన్ని విధాలా అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. కోర్టు వ్యవహరాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. ఆకస్మింగా ప్రయాణాలు వాయిదాపడతాయి.
 
కన్య :- ఆస్తి పంపకాలు, భాగాస్వామిక చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. విదేశాల్లో ఉంటున్న ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. ఖర్చులు అధికమైనా భారమనిపించవు. వాహనచోదకులకు చికాకులు తప్పవు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులలో అధికారుల నుంచి ఆక్షేపణలు, అభ్యంతరాలు ఎదురవుతాయి.
 
తుల :- ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర వ్యాపారాలు ఊపందుకుంటాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. సంఘంలో గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు లభిస్తాయి.
 
వృశ్చికం :- మీ ప్రత్యర్థుల శక్తిసామర్ధ్యాలను తక్కువ అంచనా వేయకండి. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. గత తప్పిదాలు పునరావపునరావృతమయ్యే ఆస్కారం ఉంది. ఖర్చులు అధికం. గృహంలో ఒక శుభకార్యానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. 
 
ధనస్సు :- స్త్రీలకు అయిన వారి నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. వ్యాపారాల్లో పోటీ తత్వం ఆందోళన కలిగిస్తుంది. దైవ, సేవా, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి కల్గుతుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. అనుకున్న పనులు ఒక పట్టాన పూర్తి కావు. బంధువుల రాకపోకలు పునఃప్రారంభమవుతాయి.
 
మకరం :- ఉద్యోగస్తుల హోదా పెరదటంతో పాటు బరువుబాధ్యతలు అధికమవుతాయి. వృత్తిపరంగా ఊహించని చికాకులెదుర్కుంటారు. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవటం మంచిది కాదు. కావటంతో అదనపు ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. స్త్రీలకు చుట్టుపక్కల వారిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.
 
కుంభం :- భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తినిస్తాయి. పారిశ్రామిక రంగా వారికి అన్ని విధాలా అనుకూలం. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన ప్రతిఫలం లభించదు. ప్రముఖుల కలయిక అనుకూలిస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. 
 
మీనం :- కావలసిన వస్తువు లేక పత్రాలు సమయానికి కనిపించకుండా పోయే ఆస్కారం ఉంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. మీ శ్రీమతి ప్రోద్బలంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలెడతారు.