గురువారం, 13 జూన్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

20-11-2023 సోమవారం దినఫలాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన మీ సంకల్పం...

horoscope
శ్రీ శోభకృత్ నామ సం|| కార్తీక శు॥ అష్టమి తె.3.15 ధనిష్ఠ రా.10.15 తె.వ.4.57 ల ప.దు. 12.06 ల 12.51 పు.దు. 2.22ల 3.07.
 
మల్లికార్జునుడిని ఆరాధించిన మీ సంకల్పం సిద్ధిస్తుంది.
 
మేషం :- హోటల్, క్యాటరింగ్ పనివారలకు అన్ని విధాలా కలిసిరాగలదు. మీ ఆంతరంగిక విషయాలు, కుటుంబ సమస్యలు గోప్యంగా ఉంచండి. ఒక శుభకార్యం నిశ్చయం కావటంతో స్త్రీలలో ఒత్తిడి, హడావుడి చోటుచేసుకుంటాయి. చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు.
 
వృషభం :- ముందుచూపుతో మీరు తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలనిస్తుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. కొబ్బరి. పండ్ల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పాత మిత్రుల గురించి ఆందోళన చెందుతారు. రాబడికి మించిన ఖర్చుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు.
 
మిథునం :- బంధు మిత్రులను కలుసుకుంటారు. కుటుంబ అవసరాలు పెరగటంతో అదనపు సంపాదన కోసం యత్నాలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారుల నుంచి ఒత్తిడి, ఇతరత్రా చికాకులు వంటివి ఎదుర్కుంటారు. మీ విలువైన వస్తువుల విషయంలో మెళకువ వహిచండి.
 
కర్కాటకం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. దూరపు బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. స్త్రీలతో అతిగా సంభాషించటం వల్ల అపార్థాలకు గురికావలసి వస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి.
 
సింహం :- బంధు మిత్రులతో కలిసి సరదాగా గడుపుతారు. మిమ్ములను చిన్నచూపు చూసిన వారే మీ సాన్నిత్యం కోరుకుంటారు. తీర్థయాత్రలకై చేయుయత్నాలలో సఫలీకృతులవుతారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. మీ సంతానం ఆరోగ్యం, విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.
 
కన్య :- కుటుంబంలో ఊహించని చికాకు లెదురవుతాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. స్త్రీలకు పనివారంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధువులను కలుసుకుంటారు. అనుకోకుండా మీ పాత సమస్య పరిష్కారమవుతుంది. ఏజెంట్లు, బ్రోకర్లు, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది.
 
తుల :- మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజార్చుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. విదేశీయానం కోసంచేసే యత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. క్రయ విక్రయాలు ఆశించినంత లాభసాటిగా ఉండవు.
 
వృశ్చికం :- కుటుంబ సమస్య కారణంగా బాధ్యతల నిర్వహణలో ఏకాగ్రత అంతగా ఉండదు. పత్రికా సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. పారిశ్రామిక రంగాల వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. ఆత్మీయుల అతిధి మర్యాదలు సంతృప్తినిస్తాయి.
 
ధనస్సు :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. దైవ దీక్షలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. బీమా, రుణ వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. దూర ప్రయాణాలు నిరుత్సాహపరుస్తాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి గురి కావలసివస్తుంది.
 
మకరం :- కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. రేషన్ డీలర్లు, నిత్యావసర వస్తు స్టాకిస్టులకు చికాకులు తప్పవు. స్త్రీలకు రచనలు, సాహిత్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహరాలు వాయిదా పడటం మంచిదని గమనించండి.
 
కుంభం :- మీ వాగ్ధాటితో ఎదుటివారిని మెప్పిస్తారు. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమాస్తాలకు ఒత్తిడి అధికం. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
మీనం :- బంధు మిత్రులు మొహమ్మాటాలకు గురిచేస్తారు. శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, మెళకువ చాలా అవసరం. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్‌లో జాప్యం తప్పదు. ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. మొండి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు.