గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

22-05-2023 సోమవారం రాశిఫలాలు - అనంతపద్మనాభస్వామిని ఆరాధించిన శుభం...

Astrology
మేషం :- ఏదైనా స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహరాల్లో మెళకువ వహించండి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. నూతన వ్యాపారాలు, గృహంలో సందడి కానవస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూకోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది.
 
వృషభం :- సినిమా, కళారంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ఖర్చులు, సమయానికి ధనం అందక ఇబ్బందులు ఎదుర్కుంటారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. కొబ్బరి, పండ్ల, పూల, చల్లనిపానీయ చిరు వ్యాపారాలకు అన్ని విధాల కలిసిరాగలదు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
మిథునం :- విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తికరంగా ఉంటుంది. కళత్ర మొండివైఖరి వల్ల కుటుంబంలో కలహాలు, చికాకులు అధికమవుతాయి. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికం. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 
 
కర్కాటకం :- బంధువుల రాక వల్ల పనులు వాయిదాపడతాయి. సోదరులతో వివాదాలు నెలకొంటాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. ఉద్యోగ బాధ్యతల్లో చిన్న చిన్న పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. రాజకీయాల్లో వారికి ప్రత్యర్థులు వల్ల సమస్యలు తలెత్తేఆస్కారం ఉంది మెళకువ వహించండి.
 
సింహం :- స్త్రీలలో దాగియున్న రచనా పటిమకు, కళాత్మతకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. విదేశాలకు వెళ్ళటానికి చేయుయత్నాలు వాయిదాపడతాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం అని గమనించండి. ఆలయాలను సందర్శిస్తారు.
 
కన్య :- స్త్రీలు ఆడంబరాలకు ధనం బాగా ఖర్చు చేస్తారు. విదేశీయానం నిమిత్తం చేసే యత్నాలు ఒకకొలిక్కి వస్తాయి. వృత్తిపరమైన ప్రయాణాలు, సరకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత అవసరం.
 
తుల :- వైద్య శిబిరంలోని వారు తరచు ఒత్తిడులకు గురవుతారు. తలచిన పనులలో కొంత అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. బ్యాంకు వ్యవహారాలలోని పనులు చురుకుగా సాగుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి.
 
వృశ్చికం :- రాజకీయ, కళా రంగాల్లో వారు అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. తోటల రంగాల వారి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. రుణం ఏకొంతైనా తీర్చాలన్న మీ యత్నం ఫలించకపోవచ్చు. ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్‌‍లకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి.
 
ధనస్సు :- వాహన చోదకులకు అత్యుత్సాహం అనర్థాలకు దారి తీస్తుంది. పాతమిత్రుల కలయిక, దైవ కార్యాలు మానసిక ప్రశాంతతనిస్తాయి. తీర్థయాత్రలు, కొత్త ప్రదేశ సందర్శనాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. పారిశ్రామిక వేత్తలకు విద్యుత్ సమస్యలు, కార్మికులతో వివాదాలు తప్పవు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
 
మకరం :- కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో పరస్పర అవగాహనకుదరదు. ఒక వ్యవహారంలో మీ అంచనాలు, ఊహలు నిజమయ్యే ఆస్కారం ఉంది. మార్కెటింగ్, ప్రైవేటు సంస్థలలోని వారు అధిక శ్రమ, ఒత్తిడికి గురవుతారు.
 
కుంభం :- మీ బంధవులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. లీజు, ఏజెన్సీలు, టెండర్ల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. మితిమీరిన శరీర శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ లక్ష్యసాధనకు కృషి, పట్టుదల ముఖ్యమని గమనించండి.
 
మీనం :- దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు మిత్రుల నుంచి విభేదాలు తలెత్తుతాయి. ఏదైనా అమ్మటానికై చేయుప్రయత్నాలు వాయిదా పడుట మంచిది. మీ అభిప్రాయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది. స్త్రీలకు శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.