శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

25-09-2023 సోమవారం రాశిఫలాలు - శంకరుడిని పూజించినా మీ సంకల్పం నెరవేరుతుంది...

astro2
శ్రీ శోభకృత్ నామ సం|| భాద్రపద శు॥ ఏకాదశి రా.1.37 ఉత్తరాషాఢ ఉ.9.16 ప.వ.1.01 ల 2.31. ప. దు. 12.24 ల 1.13 పు. దు. 2. 52 ల 3. 41.
 
శంఖరుడిని పూజించినా మీ సంకల్పం నెరవేరుతుంది.
 
మేషం :- కళ, క్రీడా రంగాల వారికి మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. విద్యార్థులు ఇతురుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. స్పెక్యులేషన్ కలిసిరాదు. ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్‌లకు సదావకాశాలు లభిస్తాయి. ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి, చికాకు తప్పదు. ఒంటెత్తు పోకడ మంచిది కాదు గమనించండి.
 
వృషభం :- వస్త్ర, బంగారం, ఎలక్ట్రానికల్ వస్తు వ్యాపారాలకు పురోభివృద్ధి. ఎల్.ఐ.సి, పోస్టల్, ఇతర ఏజెంట్లకు, బ్రోకర్లకు పనిభారం అధికం అవుతుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో అధికమైన జాగ్రత్త అవసరం. ఇతరుల ముందు మీ ఉన్నతిని చాటుకునే యత్నాలు విరమించండి.
 
మిథునం :- ఉద్యోగస్తులకు అధికారుల నుండి గుర్తింపు, తోటివారి ప్రశంసలు లభిస్తాయి. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు, భాగస్వామిక ఒప్పందాలు ఒక కొలిక్కి రాగలవు. ధనవ్యయం, విరాళాలిచ్చే విషయంలో మెలకువ వహించండి.
 
కర్కాటకం :- పారిశ్రామిక రంగంలోని వారికి సామాన్యం. కొంతమంది మీ నుండి ధనసహాయం కోరవచ్చు. ముఖ్యులలో ఒకరి గురించి అప్రియమైన వార్తలు వింటారు. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కుంటారు. ప్రైవేటు సంస్థలలోని వారికి తోటివారి సలహా, సహకారం లభిస్తాయి.
 
సింహం :- సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు అనుకూలం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, ఓర్పు ఎంతో అవసరం. మీ సన్నిహితులు వైఖరి వల్ల విభేదాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి.
 
కన్య :- ఉద్యోగస్తులకుబరువు, బాధ్యతలు అధికం కాగలవు. రుణాలు తీరుస్తారు. విద్యార్థుల మతిమరుపు పెరగటం వల్ల ఇబ్బందులకు గురవుతారు. ఒక ముఖ్యకార్యం నిమిత్తం దూరప్రయాణం చేయవలసి వస్తుంది. బ్యాంకింగ్, ఫైనాన్సు, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. క్రయ విక్రయాల పట్ల ఏకాగ్రతవహిస్తారు. 
 
తుల :- లీజు, ఏజెన్సీలకు సంబంధించిన వ్యవహారాల్లో పునరాలోచన అవసరం. సభ సమావేశాలలో పాల్గొంటారు. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట తప్పవు. బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. ఇతరులు కారణం వల్ల చేపట్టిన పనులు ఆకస్మికంగా వాయిదా వేయవలసి వస్తుంది.
 
వృశ్చికం :- కుటుంబంలో నెలకొన్న అనిశ్చితులు, అశాంతి క్రమంగా తొలగిపోగలవు. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. ముఖ్యుల రాకపోకలు పెరుగుతాయి. ఆత్మీయులను విమర్శించుట వలన చికాకులు తప్పవు. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిర్మాణాత్మక పనుల్లో సంతృప్తి కానవస్తుంది.
 
ధనస్సు :- వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు అధికారులతో అవగాహన, తోటివారితో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రైవేటు, పబ్లిక్ సంస్థల్లో వారికి ఊహించని మార్పులు సంభవిస్తాయి. పాత బిల్లులు చెలిస్తారు. ఇప్పటివరకు విరోధులుగా ఉన్న వ్యక్తులను సుముఖం చేసుకోగలుగుతారు.
 
మకరం :- మీ ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. అందరికి సహాయం చేసి సమస్యలు ఎదుర్కొంటారు. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం వల్ల మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. క్రయ, విక్రయ రంగాల్లో వారికి సామాన్యం.
 
కుంభం :- స్త్రీలు సాహస కార్యాలకు దూరంగా ఉండటం మంచిది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ధనం విరివిగా వ్యయమైనా సార్థకత, ప్రయోజనం ఉంటాయి. ఇతరుల గురించి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యానాలు సమస్యలకు దారితీయవచ్చు జాగ్రత్త వహించండి.
 
మీనం :- కుటుంబీకుల ఆరోగ్యం విషయంలో ఏకాగ్రత వహించండి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. కొత్తగాచేపట్టిన వ్యాపారాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. బంధుమిత్రుల రాకతో గృహంలో కొత్త వాతావరణం నెలకొంటుంది.