శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

30-05-2023 మంగళవారం రాశిఫలాలు - కుబేరుడిని ఆరాధించిన ఆర్ధికాభివృద్ధి...

astro2
మేషం :- కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. కళా, ఫొటోగ్రఫీ, రంగాల వారికి అనుకూలం సమయం. లక్ష్యసాధనలో మీ అనుభవం ఉపయోగపడుతుంది. ముఖ్య విషయాల్లో పెద్దల సలహాను పాటించడం మంచిది. స్త్రీలకు వస్త్ర, ఆభరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. 
 
వృషభం :- స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో తగాదాలు ఏర్పడవచ్చు. నిర్మాణ పథకాలలో సంతృప్తి కానవస్తుంది. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు. రాజకీయ, రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు పై చదువుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు.
 
మిథునం :- గృహమునకు కావలసిన సామగ్రిని కొనుగోలు చేస్తాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. దూరపు బంధువలును కలుసుకొని ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తారు. ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
 
కర్కాటకం :- వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. మానసిక ప్రశాంతత కోసం దైవదర్శనాలు, పుస్తక పఠనం వైపు ఆసక్తి చూపుతారు. దైవ, సామాజిక, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు.
 
సింహం :- కుటుంబీకులతో కలిసి నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. మీ సంతానం మొండివైఖరి కారణంగా చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. చేతివృత్తులు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ, రుణ యత్నాల్లో కొంత పురోగతిఉంటుంది.
 
కన్య :- చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులు ఒత్తిడి, చికాకులు అధికం. ఇతరుల గురించి సంభాషించేటపుడు ముందు వెనుకలు గమనించండి. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. కాంట్రాక్టర్లకు నాణ్యాతాలోప నిర్మాణాల వల్ల కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబీకులతో విహార యాత్రలు చేస్తారు.
 
తుల :- రచన, సాహిత్య రంగాల వారికి ప్రోత్సాహకరం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకొండి. బంధువర్గాల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. మీ ప్రమేయం లేకున్నా కొన్ని తప్పిదాలకు బాధ్యత వహించవలసివస్తుంది.
 
వృశ్చికం :- స్త్రీలకు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. విదేశీ వ్యవహారాల రంగాలకు చెందిన వారికి ఆర్థికంగా ప్రోత్సహకరంగా ఉంటుంది. ప్రైవేట్ విద్యా సంస్థలలోని ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత, ఒత్తిడి, చికాకులు అధికం. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
 
ధనస్సు :- వ్యాపారస్తులకు తోటివారి, అధికారుల కారణంగా ఆందోళనకు గురవుతారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. మిమ్మల్ని హేళన చేసేవారు మీ సహాయాన్నిఅర్థిస్తారు. వైద్యులకు శస్త్ర చికిత్సల సమయంలో ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు.
 
మకరం :- గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, మెకానికల్ రంగాలలో వారికి అభివృద్ధి కానరాగలదు. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉన్నతాధికారులకు ఆకస్మిక స్థానచలనం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు.
 
కుంభం :- అందరినీ అతిగా నమ్యే మీ స్వభావం ఇబ్బందులకు దారితీస్తుంది. మీ బాధ్యతలను ఇతరులకు అప్పగించటం మంచిది కాదు. కార్మికులకు, వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. రిప్రజెంటేవ్‌లకు, ప్రైవేటు సంస్థలలో వారికి కార్పెంటర్లకు, చేతి పనివారికి కలిసి వచ్చేకాలం. వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించాలి.
 
మీనం :- విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు, చికాకులు ఎదుర్కుంటారు. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభించగలదు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. గృహనిర్మాణం, ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.