గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

10-12-2021 శుక్రవారం రాశిఫలాలు : లక్ష్మీదేవిని పూజించి, అర్చించిన శుభం...

మేషం :- ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి. పెద్దల ఆరోగ్యంలో మెలుకువ అవసరం. పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు సంబంధించిన వ్యవహారాల్లో తగు విధంగా నిర్ణయాలు తీసుకుంటారు.
 
వృషభం :- వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. మీ అభిప్రాయాలకు కుటుంబ సభ్యల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమ అధికం. నిరుద్యోగులు ఇంటర్వ్యూలో సత్ఫలితాలు పొందుతారు.
 
మిథునం :- మీకు సహాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. స్త్రీలకు ఆరోగ్య భంగం, నీరసం వంటి చికాకులు తప్పవు. ఖర్చులు పెరిగినా మీ అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుండి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. కొత్త విషయాలపై దృష్టి సారిస్తారు.
 
కర్కాటకం :- రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులు తప్పవు. మీ కుటుంబీకుల మొండివైఖరి మీకెంతో ఆందోళన కలిగించగలదు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ అభిలాష నెరవేరే సమయం అసన్నమైనది అని గమనించండి. ఖర్చులు సంతృప్తి, ప్రయోజనకరంగా ఉంటాయి.
 
సింహం :- ఉద్యోగస్తులు అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి ఉంటుంది. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత, పునఃపరిశీలన ప్రధానం. మార్కెట్ రంగాల వారికి శ్రమాధిక్యత మినహా ప్రతిఫలం అంతగా ఉండదు. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. ఆకస్మిక ఖర్చులు, చెల్లింపుల వల్ల ఒడిదుడుకులు తప్పవు. 
 
కన్య :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. రావలసిన మొండి బాకీలు వాయిదా పడతాయి. గృహంలో ప్రశాంత లోపం, ఆరోగ్యంలో సమస్యలు వంటి చికాకులను ఎదుర్కొంటారు. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ రూపొందించుకుంటారు. స్త్రీలకు బంధువుల రాక వల్ల పనులు వాయిదా పడతాయి.
 
తుల :- ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పెద్దల జోక్యంతో అనుకోకుండా ఒక సమస్య సానుకూలమవుతుంది. పెంపుడు జంతువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. రుణాల కోసం అన్వేషిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాల కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు.
 
వృశ్చికం :- ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరి సలహా పాటించటం శ్రేయస్కరం. విద్యార్థులకు కొత్త పరిచయాలు, వాతావరణం సంతృప్తినిస్తాయి. మీ అభిప్రాయాలు గుట్టుగా ఉంచి ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతరు పలుమార్లు తిరగవలసి ఉంటుంది.
 
ధనస్సు :- ఆర్థిక వ్యవహారాల్లో స్వల్ప ఒడిదుడుకులెదుర్కుంటారు. ఉద్యోగ ప్రకటనలపై అవగాహనముఖ్యం. బంధువుల రాక వల్ల పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఖర్చులు అదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. పుణ్య, సేవా శుభకార్యాల్లో పాల్గొంటారు.
 
మకరం :- నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పైఅధికారు నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. విద్యార్థులకు వాహనం నడుపేటప్పుడు ఏకాగ్రత ముఖ్యం. వైద్యసేవలు అవసరం కావచ్చు. ప్రముఖుల కలయిక వల్ల ఫలితం ఉండదు.
 
కుంభం :- స్త్రీలకు తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. దూర ప్రయాణాలలో పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త అవసరం. మీ పథకాలు, ప్రణాళికలు ఆశించిన ఫలితాలనీయవు. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. వ్యాపారాల్లో పోటీ ఆందోళన కలిగిస్తుంది.
 
మీనం :- రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. బంధు మిత్రులతో మనస్పర్థలు తలెత్తుతాయి. ఆరోగ్యం మందగించే సూచనలున్నాయి. జాగ్రత్త వహించండి ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌‌‌పోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి చికాకులు తప్పవు. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టకుండా మెలకువతో వ్యవహరించండి.