గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-12-2021 బుధవారం రాశిఫలాలు : మహావిష్ణువును ఆరాధించిన పురోభివృద్ధి...

మేషం :- స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. పెరిగిన ధరలు, ఆకస్మిక ఖర్చుల వల్ల ఆటుపోట్లు తప్పవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలెదురైనా మొండిగా పూర్తి చేస్తారు. గృహంలో ఏదైనా వస్తువు కనిపించకుండా పోయే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులు తప్పవు.
 
వృషభం :- స్థిరాస్తి అమ్మకానికై చేయు యత్నం విరమించుకోవటం మంచిది. ఆలయ సందర్శనాలలో చురుకుగా పాల్గొంటారు. వాణిజ్య ఒప్పందాలు, నూతన వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాల్లో పునరాలోచన అవసరం. స్త్రీలు ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు. మీ యత్నాల్లో పొరపాట్లు దారే ఆస్కారం ఉంది.
 
మిథునం :- రావలసిన ధనం అతికష్టం మీద వసూలవుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తుల శ్రమను అధికారులు గుర్తిస్తారు. ప్రైవేటు, పత్రికా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు.
 
కర్కాటకం :- తల పెట్టిన పనులు మందకొడిగా పూర్తి చేస్తారు. కొంతమంది మీ ఉన్నతిని చూసి అపోహపడే ఆస్కారం ఉంది. పెద్దల ఆరోగ్య, ఆహార వ్యవహారాలలో మెళుకువ వహించండి. ఉద్యోగస్తులు స్థానమార్పిడి కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. బంధువులు మీ నుంచి పెద్ద మొత్తంలో ధనసహాయం అర్థిస్తారు.
 
సింహం :- స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. నిరుద్యోగ యత్నాలు కలిసివస్తాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. మిమ్ములను తక్కువ అంచనా వేసిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత చాలా అవసరం.
 
కన్య :- స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒడిదుడుకులు వంటివి ఎదుర్కొంటారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. మీ మాటకు సర్వత్రా ఆమోదం లభిస్తుంది. ప్రముఖులు, అయిన వారిని కలుసుకుంటారు.
 
తుల :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు, పథకాలు సత్ఫలితాలనివ్వగలవు. సమయానికి సహకరించని మిత్రుల వల్ల ఒకింత ఇబ్బందులెదుర్కుంటారు. మొండి బకాయిలు వసూలు కాగలవు. స్త్రీలకు బంధువర్గాల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలమైన మార్పులుంటాయి.
 
వృశ్చికం : -స్త్రీలకు చుట్టుపక్కల వారితో సఖ్యత లోపిస్తుంది. మీ ప్రేమ మీ జీవితంలో మరింత ఆనందాన్ని నింపుతుంది. కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన చాలా అవసరం. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. బంధు మిత్రులతో కలిసి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
ధనస్సు :- వ్యవసాయ రంగాల వారికి నూతన ఆలోచలు స్ఫురిస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఏ విషయంలోను ఎదుటివారిని అతిగా విశ్వసించటం మంచిది కాదు. రావలసిన ధనం అందకపోవటంతో ఇబ్బందులు తప్పవు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు.
 
మకరం :- భాగస్వామిక ఒప్పందాలు, స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ప్రముఖుల సలహా పాటించటం మంచిది. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయ వ్యయాలకు బడ్జెట్ రూపొందించుకుంటారు. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం అందటంతో పనులు వేగవంతమవుతాయి.
 
కుంభం :- బ్యాంకింగ్ వ్యవహారాలు, సంప్రదింపులకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత అవసరం. కోర్టు వ్యవహరాలు ప్రగతిపథంలో నడుస్తాయి. చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి ఆటు పోట్లు తప్పవు. ఫ్యాన్సీ, మందులు, ఎరువుల వ్యాపారులకు పురోభివృద్ధి. దైవ, పుణ్య, సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మీనం :- ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులతో మాటపడవలసి వస్తుంది. రావలసిన ధనం చేతికందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. స్త్రీల మనోవాంఛలు నెరవుగలవు. ఉమ్మడి వ్యాపారాల నుండి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. కళ, క్రీడా రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి.