బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

27-01-2022 గురువారం రాశిఫలితాలు - రాఘవేంద్రస్వామిని పూజించినా శుభం

మేషం :- వ్యాపారాల్లో అనుభవం, ఆశించిన లాభాలు గడిస్తారు. రవాణా రంగాల వారికి ప్రయాణికులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్సలను సమర్థంగా పూర్తి చేస్తారు. పెద్దల ఆర్యోగములో మెళుకువ అవసరం. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.
 
వృషభం :- రవాణా వ్యవహరాలలో ఆచితూచి వ్యవహరించండి. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. ధనాదాయం బాగున్నా ఊహించని ఖర్పులు వల్ల ఒడిదుడుకులు తప్పవు. మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి. ఇంటా, బయటా సమస్యలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు.
 
మిథునం :- విలాస వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరతాయి. రుణ విముక్తులు కావాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. సోదరీ, సోదరులతో కలహాలు తలెత్తుతాయి. విదేశీ యత్నాలలో కొన్ని అవాంతరాలు ఎదురైనా విజయం సాధిస్తారు. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలు అమలు చేస్తారు.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులకు నుంచి మంచి గుర్తింపు రాణింపు లభిస్తుది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. షావు గుమస్తాలు, అకౌంట్లెంట్లకు ఒత్తిడి, పనిభారం అధికం. ఇతరులను ధనసహాయం అడగటానికి అభిజాత్యం అడ్డువస్తుంది. వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
 
సింహం :- అనవసరపు సంభాషణల వల్ల సహోద్యోగులతో ఆకస్మిక బేదాభిప్రాయాలు తలెత్తే ఆస్కారం ఉంది. రాజకీయ నాయకులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. రవాణా వ్యవహరాలలో ఆచితూచి వ్యవహరించండి. స్త్రీలకు తల పెట్టిన పనిలో ఆటంకాలను ఎదుర్కొంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు.
 
కన్య :- మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. రావలసిన ధనం అనుకోకుండా చేతికందును. విద్యార్థులు అనవసర భయాందోళనలు విడనాడి శ్రమించిన జయం పొందగలరు. ప్రియతములతో విరామ కాలక్షేపాలలో పాల్గొంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి.
 
తులు :- హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. కొబ్బరి పండ్ల పూల వ్యాపారులకు కలిసిరాగలదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంతోషం కలిగిస్తుంది. ఆత్మీయుల రాకతో గృహం కళకళలాడుతుంది. ప్రయాణాల్లో ఊహించని చికాకులను ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.
 
వృశ్చికం :- ఆదాయ వ్యయాలకు ఏమాత్రం పొంతన ఉండదు. బ్యాంకు వ్యవహారాలలో ఇబ్బందులు తలుత్తుతాయి. ప్రైవేటు సంస్థల్లోని వారు తోటి వారితో స్నేహ భావంతో సంచరిస్తారు. మీ మాటే నెగ్గాలన్న పట్టుదల మంచిది కాదు. స్త్రీలకు ఆరోగ్యంలో చిన్న చిన్న చికాకులు తలెత్తగలవు. జాగ్రత్తలు అవసరం.
 
ధనస్సు :- ఆదాయానికి మంచి ఖర్చులు ఉంటాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబంలో చికాకులు తొలగిపోయి మానసిక ప్రశాంతత నెలకొంటుంది.
 
మకరం :- ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. విద్యార్థులకుతోటివారి కారణంగా చికాకులు తప్పవు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పోటీతత్వం పెరుగుతుంది. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆస్తి, స్థల వివాదాలు కొలిక్కి వస్తాయి. పాత మిత్రుల కలయికతో మీలో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది.
 
కుంభం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల పని వారికి ఒత్తిడి, చికాకులు వంటివి అధికమవుతాయి. గతంలో నిలిపి వేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభించటానికి చేయుయత్నాలు కలిసివస్తాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. చిన్ననాటి వ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది.
 
మీనం :- పోస్టల్, టెలిగ్రాఫ్, కొరియర్ రంగాల వారికి శ్రమాధిక్యత బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. దైవ సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం ఆలోచన విరమించుకోవటం మంచిది. కుటుంబీకుల కోసం నూతన పథకాలు రూపొందిస్తారు.