గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

30-04-22 శనివారం రాశిఫలాలు - శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో...

astro6
మేషం :- పారిశ్రామికవేత్తలకు నిరుత్సాహం, చికాకులు అధికమవుతాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. స్త్రీలకు బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఉమ్మడి వ్యాపారాల విషయంలో పునరాలోచన అవసరం. రాజకీయాల్లో వారికి ఆందోళనలు అధికమవుతాయి.
 
వృషభం :- పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. సంఘంలో మంచి గుర్తింపులభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు యూనియన్ వ్యవహారాల్లో అసహనానికి లోనవుతారు. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. స్త్రీలు, కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించాలి.
 
మిథునం :- వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. ఏసీ, కూలర్ మోకానిక్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. సోదరి, సోదరుల మధ్య విమర్శలు తప్పవు. ధనం ఏ కొంతైనా పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. వివాహ సంబంధమై దూరప్రాంతాలకు ప్రయాణం చేయవలసి వస్తుంది.
 
కర్కాటకం :- రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. స్త్రీలు విందు, వినోదాలలో చురుకుగా వ్యవహరించి పలువురిని ఆకట్టుకుంటారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అసరం. పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పాలు పొందుతారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది.
 
సింహం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి తోటివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఆత్మీయులను విమర్శించుట వలన సమస్యలు తలెత్తుతాయి. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిదికాదు.
 
కన్య :- నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలు ధన వ్యయంతోనే సానుకూలమవుతాయి. కుటుంబంలో నెలకొన్న అనిశ్చితలు, అశాంతి క్రమంగా తొలగిపోగలవు. ప్రేమికులు అతిగా వ్యవహరించటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. స్త్రీలు విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు.
 
తుల :- నిత్యవసర వస్తు ధరలు అధికమవుతాయి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. దైవ, పుణ్య కార్యాలకు విరివిగా ధనం వ్యయం చేస్తారు. నిరుద్యోగులు ఓర్పు, నేర్పుతో విజయాన్ని సాధించగలరు. రాజకీయనాయకులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. లిటిగేషన్ వ్యవహారాల్లో మెళకువ వహించండి.
 
వృశ్చికం :- ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. భాగస్వాములతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. మీ స్నేహితుల వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. స్త్రీల వాక్ చాతుర్యంనకు, తెలివి తేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి శ్రమించిన ఫలితాలొస్తాయి.
 
ధనస్సు :- వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ మాటతీరు, పద్దతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. స్త్రీలకు నడుము, తల, నరాలకు సంబంధించన చికాకులు అధికమవుతాయి. మీ సంతానం ఇష్టాలకు అడ్డు చెప్పటం మంచిదికాదు. కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగంలోని వారికి అనుకూలమైన కాలం.
 
మకరం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయభేధాలు తలెత్తవచ్చు. పుణక్షేత్రాలను దర్శిస్తారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి.
 
కుంభం :- రాజకీయ, కళారంగాల వారికి సన్మానం జరిగే అవకాశం ఉంది. వాహనచోదకులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించిన జార విడచుకుంటారు. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. వేడుకలు, దైవకార్యాల్లో పాల్గొంటారు. వసతి ఏర్పాట్ల విషయంలో చిక్కులు ఎదువవుతాయి.
 
మీనం :- సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కుటుంబీకులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు, రేషన్ డీలర్లకు అధికారుల వేధింపులు అధికమవుతాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో అధికమైన జాగ్రత్త అవసరం. మిత్రులతో ఉత్తర, ప్రత్యుత్తరాలు జరుపుతారు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.