సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

28-04-22 గురువారం రాశిఫలాలు - గురు చరిత్ర పారాణయం చేసి సాయిబాబాను..

astro5
మేషం :- వృత్తి వ్యపారాలలో చికాకులు తొలగిపోతాయి. రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. ప్రశాంతత కోసం ప్రయత్నిస్తారు. దీర్ఘకాలం వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. మీ శ్రీమతి తీరుకు అనుగుణంగా మెలగండి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా యోగదాయకమైన కాలం.
 
వృషభం :- ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. స్త్రీలు వస్త్రములు, ఆభరణములు వంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. తరచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది.
 
మిథునం :- ఊహించని చికాకులు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. చక్కని ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఆధ్యాతిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలకై చేయుప్రయత్నాలు వాయిదాపడును.
 
కర్కాటకం :- అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. గృహాలంకరణ అంశాలపై దృష్టి పెడతారు. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. సాహస ప్రయత్నాలు విరమించండి. విద్యార్థులకు సంతృప్తి కానరాదు. వ్యాపారాల్లో అనుభవం, ఆశించినలాభాలు గడిస్తారు.
 
సింహం :- అందరితో కలసి విందు వినోదాలలో పాల్గొంటారు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. క్రయ విక్రయదారులకు అనుకూలం. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. పత్రికా రంగంలోని వారికి గుర్తింపు రాణింపు లభిస్తుంది.
 
కన్య :- కుటుంబ విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఎలక్ట్రికల్ రంగాలలో వారికి సామాన్యంగా ఉండగలదు. మీ సంతాన విషయంలో సంతృప్తి కానవస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థులకు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పెరిగిన కుటుంబ అవసరాలు, రాబడికి మించిన ఖర్చుల వలన ఇబ్బందులకు గురౌతారు.
 
తుల :- చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. స్త్రీలకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. నిర్మాణ పనులలో పెరిగిన వ్యయం, జాప్యం ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అనవసరమైన విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు.
 
వృశ్చికం :- ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుపుతారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి చికాకుల తప్పవు. ఆకస్మిక ఆందోళన తప్పదు. ప్రియతముల కలయిక ఆనందాన్ని కలగిస్తుంది. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. దంపతుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి.
 
ధనస్సు :- ప్రయాణాల్లో తొందరపాటుతనం అంత మంచిది కాదని గమనించండి. విలువైన పత్రాలు, రశీదులు అందుకుంటారు. మీ సంతానం పరీక్షలలో విజయం సాధిస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పరిచయం లేని వారితో జాగ్రత్త.
 
మకరం :- వైద్యులకు మిశ్రమ ఫలితం. ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. అవివాహితులకు అనుకూలమైన కాలం. సాహిత్యాభిలాష పెరుగుతుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. చేసే పనులలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి.
 
కుంభం :- ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత ఎంతో ముఖ్యం. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. వ్యాపారాల్లో పోటీని ధీటుగా ఎదుర్కుంటారు. లక్ష్య సాధనము నిరంతర కృషి అవసరం.
 
మీనం :- ఉద్యోగస్తులకు వత్తిడి, చికాకులు తప్పవు వారసత్వపు వ్యవహారాలలో చికాకులు ఎదుర్కొంటారు. ప్రైవేటు సంస్థల వారు మార్పులకై చేయుప్రయత్నాలు అనుకూలించగలవు. పై అధికారుల మెప్పును పొందుతారు. మీ సమర్థతను ఎదుటివారు గుర్తిస్తారు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. వ్యాపారాల్లో కొంత నిరాశ తప్పదు.