ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 13 మే 2023 (23:25 IST)

14-05-2023 నుంచి 20-05-2023 వరకు మీ వార రాశిఫలాలు

Weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము
ఆత్మస్థైర్యంతో మెలగండి. లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. గృహమార్పు ఫలితం త్వరలో కనిపిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పాత మిత్రులతో సంభాషిస్తారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తుల వారికి సామాన్యం. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉపాధ్యాయులకు స్థానచలనం. విద్యార్థులకు సమయపాలన ప్రధానం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
వ్యవహారానుకూలత అంతంత మాత్రమే. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఖర్చులు అధికం. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆదివారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పట్టుదలతో యత్నాలు కొనసాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. సోదరుల మధ్య అవగాహన లోపం. చిన్న విషయమే సమస్యగా మారే ఆస్కారం ఉంది. విజ్ఞతతో మెలగండి. సంతానం చదువులపై దృష్టి సారిస్తారు. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. శుభకార్యానికి హాజరుకాలేరు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
సంకల్పం సిద్ధిస్తుంది. ప్రతికూలతలను అధిగమిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. సోమ, మంగళవారాల్లో నగదు, ఆభరణాలు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. సంతానం విదేశీ విద్యా యత్నం ఫలిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. రిప్రజెంటేటివ్‌లకు శ్రమ అధికం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అకాలభోజనం, విశ్రాంతి లోపం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఇదీ ఒకందుకు మంచిదే. త్వరలో శుభవార్త వింటారు. గురువారం నాడు ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. మీ శ్రీమతి లేక శ్రీవారి వైఖరిలో మార్పు వస్తుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు తప్పవు. ఆప్తుల రాక ఉల్లాసాన్సిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
కీలక విషయాలపై సాధిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా మెలగండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. శుక్రవారం నాడు కొత్త సమస్యలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఆప్తుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తుల వారికి సామాన్యం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. అవకాశాలు చేజారిపోతాయి. సన్నిహితుల కలయికతో కుదుటపడతారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆదివారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆరోగ్యం జాగ్రత్త. వైద్యపరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్తులకు ఆశాజనకం.
 
తుల: చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. వ్యవహారానుకూలత ఉంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. మంగళవారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. గృహమార్పు అనివార్యం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సోదరుల మాటతీరు మనస్తాపం కలిగిస్తుంది. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వైద్య, సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టసమయం. కీలక చర్చలు, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదములు
సంకల్పం సిద్ధిస్తుంది. ఉత్సాహంగా గడుపుతారు. ధనయోగం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. బుధ, గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొత్తవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ఆప్తుల సలహా పాటించండి. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ద్విచక్రవాహనదారులకు ఏకాగ్రత ప్రధానం. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ఈ వారం అన్ని విధాలా యోగదాయకం. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయం బాగుంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. ఆత్మీయుల రాక సంతోషాన్నిస్తుంది. సంతానం పై చదువులపై దృష్టి పెడతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ శ్రీమతి సలహా పాటించండి. గృహంలో మార్పు చేర్పులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభయోగం. ఉపాధ్యాయులకు స్థానచలనం. భూ సంబంధిత వివాదాలు కొలిక్కివస్తాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
కష్టం ఫలిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆహ్వానం అందుకుంటారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. దంపతుల మధ్య దాపరికం తగదు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ధనప్రలోభాలకు లొంగవద్దు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వేడుకకు హాజరవుతారు. ఆత్మీయుల కలయిక సంతోషాన్నిస్తుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పెట్టుబడులు కలిసిరావు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. శుక్ర, శనివారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. అవివాహితులకు శుభయోగం. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపు పనివారలతో జాగ్రత్త. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. ఆది, బుధవారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. సహోద్యోగులతో జాగ్రత్త. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.