గురువారం, 2 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 ఏప్రియల్ 2023 (20:42 IST)

తేదీ 23-04-23 నుంచి 29-04-23 వరకు మీ వార రాశిఫలాలు... (video)

Weekly astrology
మేషం : అశ్వని, భరణి1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
ఈ వారం ఆశాజనకం. పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిన్నవ్యాపారులకు ఆశాజనకం. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
సమర్థతపై నమ్మకం పెంచుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. ఖర్చులు విపరీతం. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా ఆలోచింపవద్దు. పనులు మందకొడిగా సాగుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. ఆప్తుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. పిల్లల విషయంలో శుభపరిణామాలున్నాయి. గృహమరమ్మతులు చేపడతారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వాహనదారులకు దూకుడు తగదు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
అనుకూలతలు నెలకొంటాయి. ధైర్యంగా వ్యవహరిస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. వాగ్ధాటితో ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. ఆదివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. షేర్ల విక్రయాలకు అనుకూలం. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు
సంప్రదింపులు ఫలిస్తాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పనులు చురుకుగా సాగుతాయి. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. మంగళవారం నాడు ఊహించని సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం ఉన్నత చదవులను వారి ఇష్టానికే వదిలేయండి. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. ఆప్తుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికుల ఆదాయం బాగుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
లక్ష్యాన్ని సాధిస్తారు. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. శుభకార్యం నిశ్చయమవుతుంది. కల్యాణ మంటపాలు అన్వేషిస్తారు. ఖర్చులు విపరీతం. గృహాలంకరణల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. బుధవారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. సంతానం ధోరణి అసహనం కలిగిస్తుంది. సౌమ్యంగా మెలగండి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులకు స్థానచలనం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. పరిస్థితులు త్వరలో మెరుగుపడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అధికం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. ఆప్తుల సాయంతో అవసరాలు నెరవేరుతాయి. మొండిగా పనులు పూర్తి చేస్తారు. ఆది, గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. శుక్రవారం నాడు అపరిచితుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీపై శకునాల ప్రభావం అధికం. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. సంతానం కదలికలపై కన్నేసి ఉంచండి. ఏ విషయాన్నీ తొందరగా నమ్మవద్దు. ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తులు, కార్మికులకు నిరాశాజనకం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
శుభకార్యానికి హాజరవుతారు. బంధుమిత్రుల ఆదరణ సంతోషాన్నిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు వేగవంతమవుతాయి. శనివారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఎదుటి వారు మీ వైఖరిని తప్పుపడతారు. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. గృహమార్పు కలిసివస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు స్థానచలనం. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు విపరీతం. ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. అనాలోచిత నిర్ణయాలు తగవు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. ఆదివారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు, మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వివాదాలు పరిష్కారమవుతాయి. వేడుకలో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
మీదైన రంగంలో రాణిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. మీ ఉన్నతిని చాటుకోవటాతనికి విపరీతంగా వ్యయం చేస్తారు. ఆదివారం నాడు అనుకోని సంఘటనలెదురవుతాయి. ఆధ్మాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ శ్రీమతి ఆంతర్యం గ్రహించండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. గురువారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. న్యాయ, సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆదాయాభివృద్ధి. కార్మికులకు పనులు లభిస్తాయి. ముఖ్యులకు వీడ్కోలు, స్వాగతం పలుకుతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆదివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఓర్పుతో యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. గృహమార్పు కలిసివస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆశాజనకం. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదామార్పు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపు పనివారలతో చికాకులు తప్పవు. రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి అధికం. షేర్ల క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి.