బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Kowsalya
Last Updated : గురువారం, 26 జులై 2018 (14:08 IST)

గర్భిణిలు ప్రతిరోజూ వామును తీసుకుంటే?

వామును వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది ఎక్కువగా వంటల్లోనే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అనారోగ్య సమస్యలు దరిచేరవు. మరి దీని ప్రయోజానాలు తెలుసుకుందాం.

వామును వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది ఎక్కువగా వంటల్లోనే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. దీనిని తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు. మరి దీని ప్రయోజానాలు తెలుసుకుందాం.
 
ఈ కాలంలో జలుబు అందరికి తరచుగా వస్తుంటుంది. వాతావరణం మారినప్పుడు జలుబు రావడం సహజమే. ఈ జలుబును వాముతో తగ్గించవచ్చును. వామును ఒక స్పూన్ తీసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం ఆ పొడిని శుభ్రమైన వస్త్రంలో కట్టుకుని దాన్ని వాసన పీలుస్తుంటే జలుబు వెంటనే తగ్గుతుంది. స్పూన్ వాము, ధనియాలు, జీలకర్ర ఈ మూడింటిని కలిపి పెనంపై దోరగా వేయించుకోవాలి.
 
ఈ మిశ్రమాన్ని కషాయంగా చేసుకుని తాగితే జ్వరం తగ్గుతుంది. కొద్దిగా వామును ఒక గ్లాస్ నీటిలో నానబెట్టుకుని ఆ తరువాత ఆ నీటిలో కొద్దిగా ఉప్పును కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే వాంతులు, వికారాలు తగ్గుతాయి. పాలలో వాము, మిరియాలు, ఉప్పును కలుపుకుని చూర్ణంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ భోజనానికి ముందు తీసుకోవాలి.
 
ఇలా తీసుకోవడం వలన కడుపునొప్పి తగ్గుతుంది. జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. అలానే వామును ముద్దగా చేసుకుని దంతాల మూలల్లో పెట్టుకుంటే దంతాల నొప్పి ఉండదు. గొంతునొప్పికి వాము దివ్యౌషధంగా పనిచేస్తుంది. వామును ఒక గ్లాస్ నీటిలో మరిగించి ఆ నీటిని తీసుకుంటే కిడ్నీల్లో రాళ్ల కరుగుతాయి. గర్భంతో ఉన్న మహిళలు వామును రోజూ తీసుకుంటే రక్తాన్ని శుభ్రం చేయుటలో ఉపయోగపడుతుంది. కడుపులోని బిడ్డకు రక్తసరఫరా మెరుగ్గా అందిస్తుంది.