ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : సోమవారం, 18 జనవరి 2016 (17:33 IST)

అవిసాకులోని ఆరోగ్య ప్రయోజనాలేంటి? బాగా నమిలి తినకపోతే?

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కంటిదృష్టి లోపాలను, అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. అదే అవిసాకులో హైబీపీని నియంత్రించే పోషకాలున్నాయి. కంటిని అవిసాకు రెప్పలా కాపాడుతాయి. ఉష్ణాన్ని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ ఎ, ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. వేడితో ఏర్పడే జ్వరం, దగ్గు, జలుబును ఇది నయం చేస్తుంది. వాతం, కఫాన్ని తగ్గిస్తుంది. గుండె, మెదడు, ఊపిరితిత్తులు, జీర్ణమండలాన్ని పరిరక్షిస్తుంది.   
 
కడుపునొప్పి తీవ్రతను తగ్గించాలంటే అవిసాకు రసాన్ని ఉడికించి ఆ నీటిలో కాసింత తేనెను కలుపుకుని తాగితే సరిపోతుంది. అవిసాకును వండేందుకు ముందు ఆకుల్ని బాగా నీటిలో శుభ్రంగా కడిగేయాలి. ఆ తర్వాతే ఉడికించి తీసుకోవాలి. అవిసాకును బాగా నమిలి తినాలి. తొందర తొందరగా తినేస్తే.. అజీర్తి తప్పదు. టాబ్లెట్స్ తరచూ తీసుకునే వారు, మద్యం తాగే అలవాటున్నవారు అవిసాకును తీసుకోకపోవడమే మంచిది. తీసుకునే టాబ్లెట్లు, మద్యంలోని రసాయనాలకు అవిసాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అందుకే తరచూ మందులు వాడేవారు ఈ ఆకుకూరను తీసుకోకపోవడం ఉత్తమం.
 
అవిస ఆకులలో కాల్షియం, ఇనుము, విటమిన్‌-ఎ అధికంగా ఉండడం వలన ఎముకలు, కీళ్ల సమస్యలు, రక్తహీనత, కంటిచూపుకు ఇది చాలా శ్రేష్టమైనది. జ్వరం, సైనస్‌, శ్వాసక్రియ సమస్యలు, తలనొప్పి, గుండె జబ్బులు, గాయాల నివారణకు అవిశఆకు ఉపశమనం కలిగిస్తుంది.