సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2017 (13:02 IST)

కొత్తిమీరతో కొవ్వు తగ్గుతుంది... కొత్తిమీర, నిమ్మరసం, తేనె కలిపి తాగితే?

ప్రతి రోజూ వంటల్లో వాడే కొత్తిమీరతో బరువు తగ్గొచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కొత్తిమీర భేష్‌గా పనిచేస్తుంది. తలతిరగడం, వేవిళ్లు, చర్మవ్యాధులను నయం చేసే గు

ప్రతి రోజూ వంటల్లో వాడే కొత్తిమీరతో బరువు తగ్గొచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కొత్తిమీర భేష్‌గా పనిచేస్తుంది. తలతిరగడం, వేవిళ్లు, చర్మవ్యాధులను నయం చేసే గుణం కొత్తిమీరలో పుష్కలంగా వుంది. కొత్తిమీరలో సి, కె, ఇనుము, క్యాల్షియం వంటి పోషకాలు వున్నాయి. ఎముకలకు బలం చేకూరాలంటే కొత్తిమీరను ఆహారంలో చేర్చుకోవాలి. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. వాత రోగాలను నయం చేస్తుంది. ఆకలిని పెంచుతుంది. 
 
కొత్తిమీర టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారు. కొత్తిమీర, ఉసిరికాయ వడియాలు తీసుకుని ఓ పాత్రలో రెండు గ్లాసుల నీటిలో వేసి మరిగించాలి. ఈ నీటిని వడగట్టి బెల్లం చేర్చి తీసుకుంటే.. తల తిరగడం, వేవిళ్లు, కిడ్నీ వ్యాధులు తొలగిపోతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 
 
ఇంకా బరువు తగ్గాలంటే.. కొత్తిమీర, నిమ్మరసం, తేనెతో సూపర్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. ఓ పాత్రలో కొత్తిమీర ఆకులు 50 మి.గ్రాములు తీసుకుని నీరు చేర్చి మరిగించాలి. ఇందులో నిమ్మరసం రెండు స్పూన్లు చేర్చండి. ఇది మరిగాక వడగట్టి ఒక స్పూన్ తేనె చేర్చి.. ఒక వారం పాటు పరగడుపున తీసుకుంటే బరువు తగ్గుతారు. కొత్తిమీరలో అధిక శాతం పీచు వుంటుంది. 
 
పీచు కారణంగా కిడ్నీలో రాళ్లను తొలగించుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌ను ఇది వెలివేస్తుంది. అప్పుడప్పుడు కొత్తిమీర జ్యూస్ తాగితే జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. దంత సమస్యలకు కొత్తిమీర మెరుగ్గా పనిచేస్తుంది. చిగుళ్ల వాపుకు కొత్తిమీర చెక్ పెడుతుందని ఆయుర్వేద నిపుణు అంటున్నారు.