Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపున పచ్చి కరివేపాకులు నమిలి తింటే...

Updated: సోమవారం, 19 నవంబరు 2018 (14:07 IST)
కరివేపాకు లేనిదే ఏ కూర చేయరు. అంటే భారతీయ వంటల తయారీలో కరివేపాకుకు అంత స్థానం ఉందన్నమాట. అలాంటి కరివేపాకును కొందరు ఇష్టంగా ఆరగిస్తే మరికొందరు మాత్రం ఆకు కదా అని తీసిపారేస్తారు. నిజానికి కరివేపాకులో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే ఏ ఒక్కరూ కూడా దాన్ని తీసిపడేయరు. అలాంటి కరివేపాకులో ఉన్న ఔషధ గుణాలు ఏంటో పరిశీలిద్ధాం. 
 
* ప్రతిరోజూ ఉదయాన్ని పరగడుపున 5 లేదా 10 కరివేపాకులను అలానే పచ్చివి నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల మధుమేహం అదుపులోకి వస్తుంది. ముఖ్యంగా రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 
 
* కరివేపాకు పొడితో అన్నం ఆరగిస్తే అజీర్తి తగ్గిపోతుంది. పైగా, ఆకలి పెరుగుతుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అయితే, కరివేపాకులకు మెంతులు, మిరియాలు కూడా కలిపి పొడి చేసుకుంటే ఇంకా మంచిది. 
 
* కరివేపాకులో అనేక పోషకాలు ఉన్నాయి. కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, ఆంటీయాక్సిడెంట్స్, కెరోటిన్, ప్రొటీన్స్, కొవ్వు పదార్థాలతో పాటు.. పిండిపదార్థాలు, ఫైబర్, మినరల్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల నిత్యం కరివేపాకును ఆరగించడం వల్ల పైన చెప్పిన పోషకాలన్నీ శరీరానికి లభ్యమవుతాయి. 
 
* మజ్జిగలో కరివేపాకు ఆకుల రసం కలిపి తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి. కొబ్బరినూనెలో కొద్దిగా కరివేపాకు పేస్ట్ వేసి బాగా మరగబెట్టి అనంతరం వచ్చే ద్రవాన్ని వడబోసి వెంట్రుకలకు రాసుకుంటే వెంట్రుకలు నిగనిగలాడుతాయి. జట్టు సమస్యలూ తొలగిపోతాయి. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments