శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Kowsalya
Last Updated : బుధవారం, 5 సెప్టెంబరు 2018 (16:12 IST)

గురక సమస్యలతో బాధపడుతున్నారా... ఈ చిట్కాలు పాటిస్తే?

గురకకు కారణం ఒక్కొక్కరి విషయంలో ఒక్కో విధాంగా ఉంటుంది. ఊపిరితిత్తులలోకి గాలి పీల్చుకునే ముక్కు, నోరుల గాలి ద్వారాలు స్త్రీలలో కంటే మగవారిలో చాలా ఇరుకుగా ఉంటాయి. ఇలా ఇరుకుగా ఉంటే నోటి ద్వారం, ముక్కుల్ల

గురకకు కారణం ఒక్కొక్కరి విషయంలో ఒక్కో విధాంగా ఉంటుంది. ఊపిరితిత్తులలోకి గాలి పీల్చుకునే ముక్కు, నోరుల గాలి ద్వారాలు స్త్రీలలో కంటే మగవారిలో చాలా ఇరుకుగా ఉంటాయి. ఇలా ఇరుకుగా ఉంటే నోటి ద్వారం, ముక్కుల్లో పెరిగే కొవ్వు కండలు వంటి సమస్యలు గురక రావడానికి వంశపార్య కారణాలుగా చెప్పవచ్చును.
 
తరచుగా తుమ్ములు, దగ్గు, జలుబుతో బాధపడేవారికి ముక్కు రంధ్రాలు శ్లేష్మంతో మూసుకుపోయి గాలి పీల్చుకోలేని పరిస్థితిలో గురక బాధిస్తుంటుంది. మద్యపానం సేవించే వారికి కండరాలు బిగువు కోల్పోయి గురక ఎక్కువవుతుంది. చాలా మందిలో స్థూలకాయం కూడా గురకకి ప్రధానమైన కారణంగా మారి ఇబ్బంది పెడుతుంది. 
 
పిప్పర్‌మెంట్ ఆయిల్‌ను చేతి వేళ్లకు రాసుకుని దాని వాసన పీల్చుకుంటే గురక రాదు. ఆలివ్ ఆయిల్‌లో కొద్దిగా తేనే కలుపుకుని రాత్రి నిద్రపోయే ముందుగా ఆ నూనెను తీసుకుంటే కూడా గురక తగ్గుతుంది. ఆవు నెయ్యిని వేడిచేసుకుని చల్లారిన తరువాత ముక్కు రంధ్రాల్లో పోసి పీల్చుకుంటే కూడా గురక సమస్యలు తొలగిపోతాయి.