మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : సోమవారం, 12 మార్చి 2018 (09:58 IST)

చేపనూనెతో తేనెను కలుపుకుని తీసుకుంటే?

చేపనూనెతో తేనెను కలుపుకుని తీసుకుంటే.. చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తేనెను పరగడుపున వేడినీటితో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు. నిమ్మరసాన్ని తేనెతో కలిప

చేపనూనెతో తేనెను కలుపుకుని తీసుకుంటే.. చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తేనెను పరగడుపున వేడినీటితో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు. నిమ్మరసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే వేవిళ్లు, జలుబు తగ్గుతుంది. అదేవిధంగా తేనెతో ఉల్లిపాయల రసాన్ని కలిపి తీసుకుంటే కంటి దృష్టి మెరుగుపడుతుంది.
 
ఇక జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందాలంటే, శ్వాసకోశ వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. బార్లీ గంజిని తయారు చేసుకుని దానిని వడగట్టి.. అందులో తేనె కలిపి తీసుకోవాలి. తేనెను దానిమ్మ రసంతో కలుపుకుని రోజూ తీసుకుంటే.. గుండెపోటు సమస్యలు దరిచేరవు. జీలకర్రను నీటిలో బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి.. అందులో తేనె కలుపుకుని తాగితే మోకాళ్ల నొప్పిని దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి ఖనిజలవణాలు, థైమీన్, రిబోఫ్లావిన్, పైరిడాక్సిన్, పాంటోథెనిక్ యాసిడ్, నికోటెనిక్ యాసిడ్… లాంటి విటమిన్లు వున్నాయి. ఊబకాయులు పరగడుపున రెండు టీస్పూన్ల నిమ్మరసంలో అరచెంచా తేనెను కలుపుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 
 
ఫ్లేవోనాయిడ్లు, టెర్పీన్లు, పాలీఫినాల్లు అనే ఔషధగుణాలు.. అనేక రకాల అల్సర్లను తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, క్యాన్సర్, హృద్రోగాల్ని అడ్డుకుంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.