1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2022 (23:13 IST)

మలబార్ చింతపండు గురించి తెలుసా? కొలెస్ట్రాల్ పరార్ (video)

kudampuli
kudampuli
మలబార్ చింతపండును వంటల్లో వాడటం ద్వారా కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.. దక్షిణ భారత దేశంలో ఈ చింతపండును ఎక్కువగా వాడతారు. ఇళ్లలో, రెస్టారెంట్లలో ఈ చింతపండును వంటల్లో చేర్చుతారు.
 
1000 సంవత్సరాల క్రితం నుండి మలబార్ చింతను వంటకు ఉపయోగించారు. శరీర బరువును తగ్గించి, గుండెను రక్షించే, మెదడు పనితీరును ఉత్తేజపరిచే శక్తి మలబార్ చింతకు ఉంది. కేరళలో ఈ చింతపండును అధికంగా వాడతారు. మలబార్ చింతపండు జీర్ణ అవయవాలను ఉత్తేజపరుస్తుంది. వాటి శక్తిని పెంచుతుంది. 
 
బరువు తగ్గించే మందులలో మలబార్ చింతను అత్యంత ముఖ్యమైన పదార్ధంగా ఉపయోగిస్తారు. ఇందులోని 'హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్' గుండెను కాపాడుతుంది. ఇది మెదడు కార్యకలాపాలను కూడా ప్రేరేపిస్తుంది. మెదడు శక్తిని పెంచుతుంది. కండరాలు, స్నాయువులను బలపరుస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో సహాయపడుతుంది.
 
ఇది డయేరియాను నియంత్రిస్తుంది. మలబార్ చింతపండును ఉపయోగించడం ద్వారా వృద్ధాప్యంలో వచ్చే కీళ్లనొప్పులు రాకుండా చూసుకోవచ్చు. ఈ చింతపండు శరీరంలో వాత నాడిని మెరుగుపరిచే గుణాన్ని కలిగివుంటుంది. దీన్ని రెగ్యులర్‌గా ఆహారంలో భాగం చేయడం వల్ల నరాల సంబంధిత సమస్యలు నయమవుతాయి. 
 
జీర్ణక్రియ కూడా సాధారణమవుతుంది. మామూలు చింతపండుకు బదులు మలబార్ చింతపండును వాడితే శరీర ఆరోగ్యం పెరుగుతుంది. కొవ్వును కరిగించడంలో మలబార్ చింతపండు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి, డైటర్లు దీనిని వాడవచ్చు. మలబార్ చింతపండును రసంతో కలిపి తింటే ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.