సోమవారం, 14 అక్టోబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 16 డిశెంబరు 2022 (18:45 IST)

మొలకెత్తిన గింజలు తింటే?

మొలకెత్తిన గింజలు, ధాన్యాలు, కాయ ధాన్యాలలో ఈ పోషకాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. మొలకెత్తిన తర్వాత గింజలు చాలా వరకు విటమిన్ ఎ ఎనిమిది రెట్లు పెరుగుతుంది. మొలకలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
మొలకల్లో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల జుట్టు, చర్మం, గోళ్లు మొదలగునవి పెరగడానికి సహాయపడుతాయి.
 
మొలకలలో వుండే ఆల్కైజెస్‌ ప్రాణాంతక‌ వ్యాధులైన క్యాన్సర్ వంటి వాటిని నివారించడంలో సహాయపడతాయి.
 
మొలకలు తింటే మన శరీరంలోని రక్తంతో పాటు, ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని బాగాలకు ప్రసరించేందుకు సహాయపడుతాయి.
 
మొలకెత్తిన గింజల్లో వుండే విటమిన్ సి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
 
మొలకలు రక్తనాళాల్లో కొత్త రక్తకణాలు ఏర్పడేలా చేసి శరీరంలో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌ మెరుగుపడేందుకు దోహదపడుతుంది.
 
సహజ గింజలలో కంటే మొలకెత్తిన విత్తనాల్లో 20 సార్లు అసలు విలువలను పెంచుతాయని కొన్ని పరిశోధనల్లో తేలింది.
 
మొలకల్లో ఫైబర్ కంటెంట్ అధికం కనుక శరీర బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.