శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2017 (13:09 IST)

దురదను దూరం చేయాలంటే.. ఇలా చేయండి..

దురద వేధిస్తుందా? ఇన్ఫెక్షన్లతో విసుగొస్తుందా? అయితే ఈ చిట్కాలు పాటించండి. దురదకు వేప బాగా పనిచేస్తుంది. దురద తగ్గాలంటే వేప నూనెను వాడాలి. అలాగే పసుపును కూడా ఉపయోగించాలి. పసుపు, వేప రెండింటిలో యాంటిబయ

దురద వేధిస్తుందా? ఇన్ఫెక్షన్లతో విసుగొస్తుందా? అయితే ఈ చిట్కాలు పాటించండి. దురదకు వేప బాగా పనిచేస్తుంది. దురద తగ్గాలంటే వేప నూనెను వాడాలి. అలాగే పసుపును కూడా ఉపయోగించాలి. పసుపు, వేప రెండింటిలో యాంటిబయోటిక్స్ పుష్కలంగా వుండటంతో.. వీటిని ముద్దగా నూరి.. వారానికి ఒక్కసారైనా వంటికి పట్టించి.. అర్థగంట తర్వాత స్నానం చేయాలి. 
 
ఇంకా వేప, పసుపు ముద్దకు సున్నిపిండి కలిపితే ఒంటి మీద వున్న మురికి పోతుంది. మృత కణాలు తొలగిపోతాయి. చర్మం శుభ్రం అవుతుంది. ఇంకా స్నానం చేసేటప్పుడు నిమ్మరసం కలిపిన నీటిని ఉపయోగించడం ద్వారా చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చు. 
 
అంతేకాకుండా కొబ్బరినూనెలో వేపాకు రసం కలిపి.. బాగా కాచి శరీరానికి రాసుకుంటే దురద తొలగిపోతుంది. రోజూ చెంచా వేపాకు పొడిని తేనెతో కలుపుకుని తీసుకుంటే ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి. ఉసిరికాయ పొడిని ఆవు నేతితో కలుపుకుని మూడు పూటలూ తీసుకుంటే దురద వుండవని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.