మంగళవారం, 29 ఏప్రియల్ 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : బుధవారం, 24 డిశెంబరు 2014 (14:51 IST)

గంగవావిలి ఆకులో ఏమున్నాయ్..? ఆరోగ్య ప్రయోజనాలేంటి?

గంగవావిలి ఆకులో ఏమున్నాయ్..? ఆరోగ్య ప్రయోజనాలేంటి? అనేది తెలుసుకోవాలా? అయితే ఈ కథనం చదవండి. గంగవావిలి ఆకులో ఏ ఆకులోనూ ఉండని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. కరోనరీ హార్ట్ డిసీజ్, పక్షవాతం, ఎడిహెచ్‌డి, ఆటిజమ్‌తో పాటు పిల్లల్లో ఎదుగుదల సమస్యలను నివారిస్తుంది. అలాగే ఎ, బి-కాంప్లెక్స్, సి. ఇ విటమిన్‌లు, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్, పొటాషియం, క్యాల్షియం, కార్బోహైడ్రేడ్లు, అమైనో యాసిడ్‌లు సమృద్ధిగా ఉంటాయి. 
 
ఇందులో కెలోరీలు చాలా తక్కువ. వంద గ్రాముల ఆకులో కేవలం 16 కేలరీలే ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు దీనిని క్రమం తప్పకుండా తీసుకోవచ్చు. 
 
ఊపిరితిత్తుల ఆరోగ్యానికి దోహదం చేయడంతో పాటు ఓరల్ క్యావిటీ క్యాన్సర్‌లను నివారిస్తుంది. ఈ ఆకులోని మ్యూకస్ మెంబ్రేన్‌లు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. 
 
ఎల్‌డిఎల్ (లో డెన్సిటీ లైపోప్రొటీన్)ను తగ్గిస్తుంది. దీనినే బ్యాడ్ కొలెస్ట్రాల్‌గా వ్యవహరిస్తారు. పరిమితమైన కేలరీలతో, పోషకాలు, ఖనిజ లవణాలు పుష్కలంగా కలిగిన గంగవావిలి ఆకు తీసుకుంటే నాడీవ్యవస్థ పనితీరు క్రమబద్ధమవుతుంది.