పచ్చి తులసి ఆకులను నీటిలో మరిగించి తాగితే?
వేసవిలో మజ్జిగ ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. మజ్జిక శరీరానికి చలువ చేస్తుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది. మసాలాలు తిన్నప్పుడు తరచుగా కడుపులో వికారం, గ్యాస్, అసిడిటీ వస్తుంది. దాని నుండి తక్షణమే ఉపశమనం పొందాలంటే మజ్జిగ తప్పనిసరిగా త్రాగాలని చెబుతున్నారు నిపుణులు. మజ్జిగలోని లాక్టిక్ ఆసిడ్ అనే ఆమ్లం కడుపులోని గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది.
పచ్చి తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి చల్లార్చి త్రాగాలి. ఇలా రోజూ త్రాగితే గ్యాస్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చని వారు సూచిస్తున్నారు. అలాగే అసిడిటీకి కొబ్బరి నీరు దివ్యౌషధం, కొబ్బరి నీరు త్రాగితే తక్షణమే శక్తి లభిస్తుంది. గ్యాస్ సమస్యను తగ్గించడానికి బెల్లం ఎంతగానో దోహదపడుతుంది. బెల్లంలోని మెగ్నీషియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాల్షియం కూడా లభిస్తుంది.
ఇంకా చెప్పాలంటే, ఒక కప్పు నీటిని మరిగించి అందులో ఒక స్పూన్ సోంపు వేసి కాసేపు అలానే ఉంచాలి. ఆ పాత్రకు మూత పెట్టి రాత్రంతా అలానే ఉంచాలి. ఉదయాన్నే ఈ నీటిలో స్పూన్ తేనె కలుపుకుని తాగండి. ఇలా రోజుకు మూడుపూటలా తాగితే అసిడిటీకి పరిష్కారం లభించినట్లేనని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.