అసిడిటీ నుంచి తప్పించుకోవాలంటే..? ఈ చిట్కాలు పాటించండి..

శుక్రవారం, 29 మార్చి 2019 (18:14 IST)
అజీర్తి, అసిడిటీ, కడుపునొప్పితో బాధపడేవారు చాలా మంది ఉంటారు. అసిడిటీ కారణంగా గుండెలో మంట కూడా వస్తుంది. ఆహారం జీర్ణం కాకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. అవి మనం తీసుకునే ఆహారం, సమయంపై ఆధారపడి ఉంటాయి. వేళ తప్పించి భోజనం చేయడం, మద్యపానం, ధూమపానం, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ తదితర కారణాల వల్ల కూడా కొందరిలో అజీర్ణ సమస్య వస్తుంటుంది. 
 
మనం జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఒక వేళ మీరు ఆహారం జీర్ణం కాక ఇబ్బంది పడుతుంటే ఈ చిట్కాలను పాటించండి. వెంటనే ఉపశమనం పొందవచ్చు. అల్లం అజీర్ణ సమస్యకు చక్కని మందు. ఓ గ్లాసు నీళ్లలో కొన్ని తురిమిన అల్లం ముక్కలు వేసి బాగా వేడిచేయండి. ఆ తర్వాత వడపోసి ఆ నీటిని చల్లారక ముందే త్రాగేయండి. 
 
అప్పుడు ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. లేదా అల్లం ముక్కలను దంచి ఆ రసాన్ని సేకరించి త్రాగినా మంచి ప్రయోజనం ఉంటుంది. మీ కోసం మరో సులభమైన చిట్కా ఉంది. ఒక గ్లాసు నీళ్లలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి తాగితే, తక్షణమే ఉపశమనం పొందవచ్చు. నీటికి బదులుగా తేనె, నిమ్మరసాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఒక గ్లాస్ నీటిలో 1 టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి తాగితే అజీర్ణ సమస్య దూరమవుతుంది. 
 
ఒక గ్లాస్ నీటిలో కొన్ని సోంపు గింజలను వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని వేడిగా తాగితే మంచిది. ద్రవ రూపంలో కాకుండా ఘన రూపంలో తీసుకోవాలంటే, గుప్పెడు వాము తీసుకుని అందులో కొంత ఉప్పు వేసి బాగా నలిపి ఆ మిశ్రమాన్ని తినండి. వెంటనే నీరు తాగాలి. దీంతో గ్యాస్, అసిడిటీ, అజీర్ణం తగ్గుతాయి.

అన్నీ చూడండి

చారిత్రాత్మక విక్రమ్-1 ప్రయోగానికి శ్రీహరికోట సిద్ధం

సామాన్య భక్తురాలిలా అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న అన్నాలెజినోవా

గుర్తించడం, అడ్డుకోవడం, నాశనం చేయడం ద్వారా నార్కో-టెర్రర్‌ను నిర్మూలిస్తాం: హోం మంత్రి అమిత్ షా

కోవిడ్ కేసులు: కేరళలో 115, కర్నాటక 64, ఏపీలో 13 మాత్రమే, కానీ అప్రమత్తం

జోహార్ ముద్రగడ అనే నినాదాలు మాని సీఎం జగన్ అంటారా?: ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శ

అన్నీ చూడండి

అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో పళ్ళబురుసు చిత్రం ప్రకటన

Dixith Shetty :దీక్షిత్ శెట్టి, శశి ఓదెల చిత్రానికి #KJQ (కింగ్ జాకీ క్వీన్) పేరు ఖరారు

Fauji Poster Controversy: ఫౌజీ రిలీజ్ డేట్ పోస్టర్ లో ప్రభాస్ కాలి వేళ్లపై అభిమానుల్లో రచ్చ ?

Samantha: చిత్తూరులో సమంతకు సీమంతం

అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో నిర్మాత శరత్‌చంద్ర నాయుడు

తర్వాతి కథనం
Show comments