Webdunia - Bharat's app for daily news and videos

Install App

తులసీ ఆకులను మజ్జిగతో కలిపి తీసుకుంటే బరువు మటాష్

Written By సెల్వి
Updated: సోమవారం, 13 జనవరి 2020 (11:57 IST)
తులసి శరీరంలో ఉండే అధిక కొవ్వును నివారిస్తుంది. తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు. అలాగే నిద్రలేమితో బాధపడేవారికి తులసి గొప్ప ఔషధం. అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు రెండు చెంచాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది. 
 
శీతాకాలంలో  జలుబు, దగ్గుతో బాధపడే వారు ఒక టీ స్పూను శొంఠి, ఒక టీ స్పూను మిరియాల పొడి, ఐదు నుంచి పది తులసి ఆకులు వేసి మరిగించిన కషాయాన్ని తాగితే ఫలితం ఉంటుంది.
 
ఇక గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చునే వారికి తులసి దివ్యౌషధంగా పనిచేస్తుంది. కళ్ళు మంటలు, కళ్ళవెంట నీరు కారడంలాంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని దూదితో కనురెప్పల మీద రాస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. కానీ ఈ రసం కంట్లో పడకుండా జాగ్రత్త పడాలి. 
 
తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి. తులసి రసాన్ని తేనెతో కలిపి ఒక స్పూను ప్రతిరోజూ తాగితే నోటి పూత, గొంతునొప్పి, బొంగురుపోయిన గొంతు సాఫీగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

హైదరాబాద్‌లోనే మొట్టమొదటి డైరెక్ట్ మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్ ఎల్బీ నగర్‌లో ఏర్పాటు

ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ కేసు: తొలుత ప్రియురాలు మాధురి సూసైడ్ ఎటెంప్ట్, ఇప్పుడు అదే దారిలో భార్య

యూపీఐ చార్జీలు కాదు.. యూపీఐ ట్యాక్స్ : రాహుల్ గాంధీ

శృంగారానికి నిరాకరించిన ప్రియురాలు.. ఆవేశంతో చంపేసిన ప్రియుడు...

వేధింపులు భరించలేక మామను హత్య చేసిన కోడలు.. కేసులో సరికొత్త ట్విస్ట్

అన్నీ చూడండి

Adivi Sesh: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ 2027న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Nani: న్యాచురల్ స్టార్, కయాదు లోహార్ బ్రాండ్ న్యూ పోస్టర్

Allu and Rashmika: రాకా కోసం క్రేజీ కాంబినేషన్ పుష్ప జోడీ మళ్లీ రంగంలోకి దిగింది !

Manchu Mano: ఆస్మాన్ తో మేఘాంశ్ గొప్ప హిట్ కొట్టాలని కోరుకుంటున్నా : మంచు మనోజ్

SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?

తర్వాతి కథనం
Show comments