శనివారం, 25 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2016 (15:40 IST)

గర్భం ధరించాలా? బాదం, అరటితో పాటు ఫుల్ ఫ్యాట్ డైరీ ఉత్పత్తులు తీసుకోండి..

సంతాన సాఫల్యం కోసం మహిళలు, పురుషులు జీవన విధానం మార్పులు చేసుకోవాలి. ఇంకా ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.. గైనకాలజిస్టులు. మహిళలు గర్భం పొందాలంటే.. పుష్కలమైన ఆహారం తీసుకోవాల్సిందే. పు

సంతాన సాఫల్యం కోసం మహిళలు, పురుషులు జీవన విధానం మార్పులు చేసుకోవాలి. ఇంకా ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.. గైనకాలజిస్టులు. మహిళలు గర్భం పొందాలంటే.. పుష్కలమైన ఆహారం తీసుకోవాల్సిందే. పుష్కలమైన విటమిన్స్ కలిగినటువంటి బెస్ట్ ఫుడ్ అయిన అరటి పండ్లను రోజుకు రెండు తీసుకోవాలి. ఇవి హార్మోనులను రెగ్యులేట్ చేస్తాయి. ఎగ్ స్పెర్మ్ డెవలప్మెంట్‌కు బాగా సహాయపడుతాయని న్యూట్రీషన్లు చెప్తున్నారు. 
 
అలాగే బాదంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మహిళల్లో ప్రత్యుత్పత్తికి అవసరం అయ్యే పోషకాంశాలు అందిస్తాయి. ఇంకా గర్భం పొందడానికి ప్రయత్నిస్తున్న మహిళలకు ఫుల్ ఫ్యాట్ డైరీ ఉత్పత్తులు బాగా సహాయపడుతాయి. సంతానోత్పత్తిని పెంచడంలో బ్రొకోలీ గొప్పగా సహాయపడుతుంది. ఇందులో ఫైటో స్టెరిలోస్ ఎక్కువగా హార్మోన్ సిస్టమ్‌కు సపోర్ట్ చేస్తుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.