మంగళవారం, 22 జులై 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : గురువారం, 11 జూన్ 2015 (17:52 IST)

గర్భం ధరించాక ఎంత బరువు పెరగవచ్చు?

గర్భం ధరించాక 10 నుంచి 12 కేజీల వరకూ బరువు పెరగడం ఆరోగ్యవంతమైన పద్ధతి. ప్రోటీన్లు, పీచు ఉండే పదార్థాలు, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, చిక్కుడు జాతి మొలకలు, గోధుమ, గుడ్లు, చేపలు, మాంసం, చికెన్ తినవచ్చు. పెరుగు, పనీర్, ఛీజ్ ప్రతిరోజూ తింటుండాలి. ఫోలిక్ యాసిడ్, ఐరన్, క్యాల్షియం సప్లిమెంట్లు గర్భిణీగా ఉన్నప్పుడు, ప్రసవం తర్వాత బిడ్డకు పాలిచ్చినంత కాలం తీసుకుంటుంటే సరిపోతుంది.
 
మదర్ ఫీడ్ పూర్తయ్యాక వ్యాయామం, వాకింగ్, జాగింగ్ వంటివి చేస్తూ.. మళ్లీ బరువు తగ్గాలి. లేకుంటే అనారోగ్య సమస్యలు ఊబకాయం వేధించే అవకాశం ఉంది. ఒత్తిడిని నివారించుకోవడంతో పాటు రాత్రి సరిగ్గా 8 నుంచి 9 గంటల పాటు నిద్రించాలి. పిల్లల నిద్ర టైమ్ టేబుల్‌ను కూడా మెల్ల మెల్లగా మార్చుకుంటూ పోతే.. ప్రసవం తర్వాత ఎదురయ్యే బాగా బరువు పెరగడాన్ని తగ్గించుకోవడం సులభమవుతుందని గైనకాలజిస్టులు అంటున్నారు.