శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 27 జులై 2019 (21:27 IST)

వాటిపై తేనె రాసుకుంటే ఏమవుతుంది?

ప్రస్తుతకాలంలో చాలామంది మొటిమల సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. వాటిని నివారించుకోవడానికి పలురకాల క్రీంలు వాడినా ఒక్కోసారి ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా సున్నితమైన చర్మం పాడయ్యే అవకాశం ఉంది. అలాకాకుండా సహజసిద్దమైన కొన్ని పదార్దాలను ఉపయోగించి ఈ సమస్యను నివారించుకోవచ్చు. అవేంటో చూద్దాం.
 
1. ముఖం మీద మొటిమలు కనిపించగానే తేనె రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తేనె యాంటీసెప్టిక్‌గా పని చేసి మొటిమల్ని త్వరగా తగ్గిస్తుంది. చర్మానికి నిగారింపు తెస్తుంది. అంతేకాకుండా చర్మంపై బ్యాక్టీరియా చేరి మొటిమలు రాకుండా నివారించడంలో కూడా తేనె త్వరితంగా పని చేస్తుంది. ఎలాంటి చర్మానికైనా తేనె సరిపడుతుంది.
 
2. ఈ సమస్యకు గుడ్డు తెల్లసొన బాగా పని చేస్తుంది. తెల్లసొనను ముఖంపై రాసుకోవడం వలన మొటిమలు రాకుండా నివారించడమే కాకుండా చర్మం మృదువుగా అవుతుంది. జిడ్డును నివారించడానికి కూడా గుడ్డు తెల్లసొనను మించింది ఏమీ లేదు.
 
3. కలబంద చర్మంపై జిడ్డును అదుపు చేసి మృత కణాలను తొలగించి కొత్త కణాలను ఏర్పరుస్తుంది. అందుకని కలబంద గుజ్జును ముఖానికి రాసుకోవడం వలన మొటిమలు తగ్గడమే కాకుండా వాటి తాలూకూ మచ్చలను కూడా తొలగిస్తుంది. అంతేకాకుండా కలబంద గుజ్జులో పసుపు కలిపి వాడితే మంచి ఫలితం ఉంటుంది. ముఖానికి కలబంద గుజ్జు రాసుకుని ఆరిన తరువాత ముఖాన్ని చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వలన మొటిమలు తగ్గుతాయి.