శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 13 ఆగస్టు 2018 (15:13 IST)

తులసి ఆకుల రసాన్ని ముఖానికి రాసుకుంటే?

ఒక బక్కెట్ నిండా నీళ్లు తీసుకుని అందులో రెండు నిమ్మకాయలు పిండుకోవాలి. ఆ రసం నీళ్ళలో బాగా కలిసిన తరువాత ఆ నీళ్ళతో స్నానం చేస్తే శరీర ఆరోగ్యానికి మంచిగా ఉపయోపడుతుంది. అంతేకాకుండా ఇన్‌ఫెక్షన్స్ దరిచేరవు.

ఒక బక్కెట్ నిండా నీళ్లు తీసుకుని అందులో రెండు నిమ్మకాయలు పిండుకోవాలి. ఆ రసం నీళ్ళలో బాగా కలిసిన తరువాత ఆ నీళ్ళతో స్నానం చేస్తే శరీర ఆరోగ్యానికి ఉపయోపడుతుంది. అంతేకాకుండా ఇన్‌ఫెక్షన్స్ దరిచేరవు. మీగడలో పసుపును కలుపుకుని ప్రతి రోజూ చర్మానికి రాసుకోవాలి.
 
15 నిమిషాల తరువాత చర్మాన్ని నెమ్మదిగా మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం కాంతివంతంగా మారుతుంది. తులసి ఆకుల రసంలో నిమ్మరసాన్ని కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాట గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం అందంగా, మృదువుగా మారుతుంది. 
 
బంగాళాదుంపల రసాన్ని ముఖానికి రాసుకుని అరగంట తరువాత కడుక్కోవాలి. వారానికి ఇలా రెండుమూడు సార్లు చేస్తే చక్కటి మృదువైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చును. పచ్చిపాలలో పసుపును కలుపుకుని అందులో దూదిని నానబెట్టుకోవాలి. కాసేపటి వరకు ఆ పాలను ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. ఆ తరువాత ఆ దూదితో నల్లని చర్మంపై రుద్దుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.