శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : ఆదివారం, 12 ఆగస్టు 2018 (14:09 IST)

తులసీ తీర్థం ఎందుకు ఇస్తారో తెలుసా?

తులసీ ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయని.. ఆయుర్వేదం చెబుతోంది. తులసి రసంలో తేనె కలుపుకొని తాగితే కిడ్నీలో ఉండే రాళ్ళు కరిగిపోతాయని అంటారు. బెల్లంతో తులసి ఆకులు కలిపి తింటే కామెర్లు తగ్గు ముఖం పడతాయని ఆయ

తులసీ ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయని.. ఆయుర్వేదం చెబుతోంది. తులసి రసంలో తేనె కలుపుకొని తాగితే కిడ్నీలో ఉండే రాళ్ళు కరిగిపోతాయని అంటారు. బెల్లంతో తులసి ఆకులు కలిపి తింటే కామెర్లు తగ్గు ముఖం పడతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. జలుబు చేసినప్పుడు తేనెలో ఒక టేబుల్‌ స్పూన్‌ తులసి రసం కలుపుకొని తాగితే ఉపశమనం లభిస్తుంది.
 
అల్లం రసంతో తులసి రసాన్ని కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. పొట్టలో నులిపురుగులు నశిస్తాయి. కాచిచలార్చిన నీళ్లలో తులసి రసాన్ని కలుపుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుంది. అంతేకాదు జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తులసి ఆకులో ఉండే రసం ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. అందుకే చాలా దేవాలయాలలో తీర్ధంలో తులిసీ దళాలను వేసి ప్రసాదంగా ఇస్తారు. 
 
తులసీ ఆకులను రెండేసి నోట్లో వేసి పరగడుపున నమిలితే.. అలర్స్‌ని దూరం చేసుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చు. కాలేయం శక్తి వంతంగా పనిచేసేందుకు తులసీ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. జ్వరాన్ని తగ్గించే గుణంలో తులసీ ఆకుల్లో వున్నాయి. నోటినుంచి దుర్వాసనను తొలగిస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.