Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

బ్లాక్ హెడ్స్‌ను తొలగించే.. దాల్చిన చెక్క...

Updated: సోమవారం, 29 అక్టోబరు 2018 (16:48 IST)
ముఖంపై ఏర్పడే బ్లాక్ హెడ్స్ చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఆఫీసుకు వెళ్లే ఉద్యోగినులకైతే ఈ తరహా సమస్యలు వేధిస్తాయనడంలో సందేహం లేదు. మొటిమలు వచ్చిన ఆ ప్రదేశంలో మచ్చలు ఏర్పడుతుంటాయి. వీటిని తొలగించుకునేందుకు భారీగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు. ఇలాంటి వారు ఈ తరహా పెరటి వైద్యంతో ఉపశమనం పొందొచ్చు. అవేంటో తెలుసుకుందాం..
 
సాధారణంగా చర్మంపై ఏర్పడే గాయాలకు మందుగా పసుపును వాడుతుంటారు. ఈ పసుపు నల్లటి వలయాలను కూడా తొలగిస్తుంది. ఎలాలో చూద్దాం.. పసుపులో కొద్దిగా పుదీనా రసం కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకుని ముఖానికి రాసుకోవాలి. ఆ ప్యాక్ బాగా ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో ముఖానికి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా మూడు రోజులు పాటు క్రమం తప్పకుండా చేస్తే నల్లటి వలయాలు తొలగిపోతాయి. 
 
నల్లటి మచ్చలు తొలగించాలంటే ఇలా చేయాలి.. దాల్చిన చెక్కను పొడిచేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఈ ప్యాక్ రాత్రి పడుకునే ముందుగా వేసుకుని ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా వారం పాటు చేస్తే.. నల్లటి మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. దాంతో అలసట, ఒత్తిడి కూడా తొలగిపోతుంది. 
 
అలానే దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా పసుపు, పెరుగు, తులసీ రసం కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. అరగంట తరువాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై గల నల్లటి మచ్చలు తొలిగిపోయి ముఖం మృదువుగా మారుతుంది. 

అన్నీ చూడండి

ఉప ఎన్నికలు : తమిళనాడులో రెండు స్థానాల్లో విజిల్ గెలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. 48 గంటల్లో వర్షాలు... ఆరెంజ్ అలెర్ట్

అక్టోబర్ 10వ తేదీన 38 రైళ్లను రద్దు చేసిన రైల్వే

కీటకాన్ని చంపడానికి సుత్తి వాడుతారా? కేంద్రం చర్యపై సీజేఐ ఘాటు వ్యాఖ్యలు

Big 24 Hours: భారత రాజకీయాల్లో రాబోయే 24 గంటలు కీలకం.. రైళ్లు రద్దు..

అన్నీ చూడండి

Ramayan: రామాయణ లో దశరథుడిగా అరుణ్ గోవిల్ - మంధరగా షీబా చద్దా

Bhogi song: బొగ్గుల గుట్ట గ్రామం నేపథ్యంలో భోగి నుంచి సాంగ్ రిలీజ్

Irumudi 50days: ఇరుముడి 50 రోజుల పూర్తి - దసరాకు రెండు సినిమాలకు సిద్ధం

బొమ్మరిల్లు లాంటి అనుభూతి క్రేజీ కల్యాణం చూశాక కలుగుతుంది : బూసం జగన్ మోహన్ రెడ్డి

Nitin: నిజం చెబితే జీవితం తారుమారయ్యే మధ్యతరగతి వ్యక్తి కథతో అలియాస్ రుక్మిణి

తర్వాతి కథనం
Show comments