Webdunia - Bharat's app for daily news and videos

Install App

శెనగపిండిలో కొద్దిగా పెరుగు కలిపి...?

Updated: సోమవారం, 18 మార్చి 2019 (14:24 IST)
మనిషిని చూడగానే ఆకట్టుకునేది ముఖమే. అలాంటి ముఖచర్మం అందంగా ఉండాలంటే.. కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు బ్యూటీ నిపుణులు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనుకునే వారికి ఈ కింది చిట్కాలు ఎంతగానో సహాయపడుతాయి. మరి అవేంటో చూద్దాం..
 
1. శెనగపిండిలో కొద్దిగా పెరుగు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంటపాటు అలానే ఉంచి ఆ తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచు చేస్తుంటే ముఖ చర్మంపై టాన్‌పోయి, చర్మం కాంతివంతంగా ఉంటుంది.
 
2. ఉల్లిరసంలో స్పూన్ ముల్తానీమట్టి, తేనె కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకుంటే సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దాంతో ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.
 
3. నిమ్మరసంలో ఆల్మండ్ ఆయిల్, సముద్రపు ఉప్పును కలిపి అందులో దూదిని ముంచి ముఖంపై గుండ్రంగా మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖ చర్మంపై మృతకణాలు పోతాయి. దాంతో చర్మం కాంతివంతంగా మారుతుంది.
 
4. టమోటాలోని యాంటీఆక్సిడెంట్స్ గుణాలు ముడతల చర్మాన్ని తొలగిస్తాయి. రెండుపెద్ద టమోటాలను మెత్తటి గుజ్జులా చేసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖంపై ముడతలు పడవు. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments