శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : శనివారం, 9 మార్చి 2019 (14:04 IST)

ఆలివ్ ఆయిల్, వెల్లుల్లిపాయతో చెవిపోటుకు మటాష్.. ఎలా?

చెవిపోటుతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారా..? పిల్లలు చెవి నొప్పితో ఏడుస్తుంటే.. ఇలా చేయండి.. అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. రోజుకు రెండుసార్లు చెవిలో కొబ్బరినూనె వేస్తే మంచిది. అందులోని లారిక్‌ ఆమ్లానికి యాంటీ మైక్రోబియల్‌ గుణాలు ఉండటంతో ఇన్ఫెక్షన్‌ తగ్గుతుంది.


కాస్త సముద్ర ఉప్పు తీసుకుని, శుభ్రమైన సాక్సులో వేసి మూటలా కట్టి, పెనంమీద పెట్టి వేడి చేయాలి. తరవాత ఈ మూటతో చెవి వెనక భాగంలో కాపడం పెట్టాలి. దీనివల్ల నొప్పి తగ్గుతుంది.
 
వెల్లుల్లిపాయల నుంచి కొద్దిగా రసం పిండి, దాన్ని వేడి చేసి రెండు మూడు చుక్కలు వేసి చెవిని అలాగే ఓ పదినిమిషాలు ఉంచాలి. లేదూ కాస్త ఆలివ్‌నూనెలో వెల్లుల్లి రసం పిండి వేసుకున్నా మంచిదే.

ఇలా రోజుకి రెండుసార్లు చేస్తే అందులోని యాంటీ మైక్రోబియల్‌ గుణాల వల్ల ఇన్ఫెక్షన్‌ తగ్గుతుంది. దీనివల్ల చెవిలో ఏమైనా వ్యాక్స్‌ ఉన్నా కరిగిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.