మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : గురువారం, 7 మార్చి 2019 (18:38 IST)

ఆమె నన్నలా చూసి కళ్లు మూసుకుంది... పెళ్లాడితే ఇద్దరికీ కుదురుతుందో లేదో..?

గత ఆరేళ్లుగా ఓ అమ్మాయిని ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాను. ఆమెకు కూడా నేనంటే ప్రాణం. నేను ఒక్కరోజు కనబడకపోతే కిందామీదు అయిపోతుంది. ఫోన్లుపై ఫోన్లు చేస్తుంది. ఐతే ఈ ఆరేళ్ల కాలంలో ఆమెను ఏడెనిమిదిసార్లు మాత్రమే దగ్గరగా స్పర్శించి ఉంటాను. ముద్దులు, కౌగలింతలు కూడా అదే లెక్క. ఆమె చాలా అందంగా ఉంటుంది. మరీ ఈమధ్య ఆమె అందం రెట్టింపయ్యింది. 
 
మంచి దుస్తులు ధరించి మొన్న నావద్దకు వచ్చింది. తట్టుకోలేక గట్టిగా కౌగలించుకున్నాను. ఆ తర్వాత మరింత ముందుకు పోవాలని చూస్తే ఒప్పుకోలేదు. శృంగార కోర్కెల కారణంగా నా వ్యక్తిగత భాగం బాగా స్తంభించింది. అదలా స్తంభించడాన్ని చూసిన ఆమె గట్టిగా కళ్లు మూసుకుని అటు తిరిగింది. ఆ రోజు ఎంత బ్రతిమాలినా ఒప్పుకోలేదు. కోర్కె తట్టుకోలేక వేరే విధంగా పాల్గొందామని అడిగాను. నా వద్ద నుంచి లేచి వెళ్లిపోయి దూరంగా కూర్చుని కళ్ల వెంట నీళ్లు పెట్టుకుంది. ఆమెకు నచ్చని పని ఏదయినా వెంటనే ఏడుస్తుంది. దాంతో నేను ఇక మళ్లీ పట్టుబట్టలేదు. హుషారు మాటలతో నవ్వించి ఇంటికి పంపించి వేశాను. 
 
ఇప్పుడు వాళ్ల ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. ఆమె మాత్రం నన్ను తప్ప ఎవరినీ పెళ్లాడనంటోంది. నేరుగా ఈ విషయం తన తండ్రితో మాట్లాడమని వత్తిడి చేస్తోంది. ధైర్యం చేసి మాట్లాడితే ఆయన ఏమంటారో కానీ... ఆమెకు శృంగారం అంటే, అలాగే నా వ్యక్తిగత భాగం అంటే పూర్తిగా ఇష్టం లేనట్లుంది. అలాంటప్పుడు ఆమెను పెళ్లాడితే ఇద్దరికీ కుదురుతుందో లేదో అని డౌటుగా ఉంది...
 
శృంగారం అంటే చాలామంది అమ్మాయిల్లో భయం నెలకొని ఉంటుంది. అదికూడా పెళ్లి కాకమునుపే అలాంటి విషయాలంటే మరీ భయం. పైగా ఇటీవల కొందరు అబ్బాయిలు కొంతమంది అమ్మాయిలను ప్రేమ పేరుతో నమ్మించి శారీరక సుఖం తీర్చుకుని వదిలేయడం వంటి వార్తలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇలాంటివన్నీ ఆమె భయానికి కారణాలై ఉండొచ్చు. 
 
పెళ్లికి ముందు ఇలా మారాం చేసినప్పటికీ పెళ్లయ్యాక అవే సర్దుకుంటాయి. ముఖ్యంగా ఆమె వద్ద ప్రేమతోనే మీరు ఏదైనా సాధించుకోవచ్చని గమనించండి. ధైర్యంగా పెద్దల వద్ద మాట్లాడి వారిని ఒప్పించి పెళ్లి చేసుకోండి. అన్నీ అవే సర్దుకుంటాయి.