Daily Horoscope
✕

నెయ్యికి బాదం పలుకులు కలిపి వేడిచేసి..?

Updated: శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:25 IST)
జుట్టు చివర్లో చిట్లుతున్నాయా? అయితే నెయ్యిని ఇలా వాడండి అంటున్నారు బ్యూటీ నిపుణులు. నెయ్యిని ఓ బౌల్‌లో తీసుకుని దాన్ని జుట్టు చివర్లలో రాయాలి. 20 నిమిషాల తర్వాత దువ్వెనతో దువ్వేసుకుని.. ఆపై మైల్డ్ షాంపూతో కడిగేస్తే మంచి ఫలితం వుంటుంది. అలాగే చుండ్రుకు చెక్ పెట్టడంలోనూ నెయ్యి భేష్‌గా పనిచేస్తుంది. 
 
గోరువెచ్చని నెయ్యికి బాదం నూనె కలిపి కురుల మొదళ్లలో రాసుకుని 20 నిమిషాల పాటు వుంచాలి. తర్వాత నూనె పోయేలా రోజ్ వాటర్‌తో శిరోజాలను కడిగేయాలి. నెలకు రెండు సార్లు ఇలా చేసి చూస్తే మంచి ఫలితం వుంటుంది.
 
అలాగే నెయ్యి శిరోజాలకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. మూడు చెంచాల నెయ్యిని ఆలివ్ ఆయిల్‌తో కలిపి వెంట్రులకు రాసుకుని అరగంట పాటు వుంచి.. ఆపై మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే కురులు నిగనిగలాడుతాయి. బట్టతల నుంచి తప్పించుకోవాలంటే.. మాసానికి ఓసారి నెయ్యిని కురులకు పట్టించడం చేయాలి. 
 
ఐదు స్పూన్ల నెయ్యికి పది బాదం పలుకులు కలిపి వేడి చేసి అవి నలుపుగా మారాక వాటిని నెయ్యి నుంచి తొలగించాలి. ఆ నూనెను మాడుకు పట్టించాలి. మూడు గంటలకు తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. మైల్డ్ షాంపును ఉపయోగించడం మరువకూడదు. ఇలా చేస్తే బట్టతల సమస్యను దూరం చేసుకోవచ్చు. 

అన్నీ చూడండి

సర్ నిర్ణయాలన్నీ ఏకగ్రీవం : సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం

హోటల్ లీజు వివాదం - ఐదుగురిని కాల్చి చంపిన వ్యక్తి

అర్నబ్ తుఫాను: ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి.. చంద్రబాబు

కాకినాడ - యానాం తీరాల మధ్య అర్నాబ్ తీరం దాటే ఛాన్స్

మైక్రోసాఫ్ట్‌లో 60 వేల మందికి ఎగ్జిట్ ఆఫర్... దిగ్భ్రాంతిలో ఉద్యోగులు..

అన్నీ చూడండి

విడుదలకు ముందే 'రామాయణం' బాక్సాఫీస్ రికార్డులు

ఉగాండా డ్యాన్స్ గ్రూపుతో నల్లంచు తెల్లచీర పాటకు స్టెప్పులేసిన భాగ్య శ్రీ బోర్సే (video)

మా కాపురంలోకి మూడో వ్యక్తిదూరాడు.. నా భార్యను తప్పుదోవ పట్టిస్తున్నారు.. : గోవిందా

కావ్య మారన్‌కు బిర్యానీ.. అనిరుధ్‌కు ఆంధ్రా మీల్స్ అంటే ఇష్టం.. ఎలా సెటవుతుందో?

ఫిల్మ్ సెట్లలో మహిళల మధ్య గొడవలు జరుగుతాయా? రాధికా ఆప్టే ఏమన్నారంటే?

తర్వాతి కథనం
Show comments