జుట్టు రాలడానికి కారణాలివే..?
జుట్టు రాలడం అనే సమస్య ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతుంది. వయస్సుతో పాటు ఆడ మగ అనే తేడా లేకుండా జుట్టు రాలుతుంది. ఈ జుట్టు రాలే సమస్యతో కనీసం 50 నుండి 80 శాతం మంది బాధపడుతున్నారు. ఏదో కొద్దిగా జుట్టు రాలుతుందంటే.. తట్టుకోవచ్చు గానీ.. అంతకుమించి రాలుతుంటే మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.
మొదటి కారణం చెప్పాలంటే.. ఆహారలోపం వలన కూడా జుట్టు రాలుతుంది. సరిగ్గా తినకపోవడం, సరైన పోషకాలు అందకపోవడం వలన జుట్టు బలహీనతంగా మారుతుంది. ఈ సమస్య స్త్రీలకే ఎక్కువగా ఉంటుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నా కూడా జుట్టు రాలుతుంది. నిద్రలేమి వలన జుట్టుకు పోషకాలు అందకపోవచ్చు. దాంతో కణజాలానికి రిపేర్ జరగకపోవడంతో జుట్టు రాలుతుంది.
వంశపారంపర్యంగా బట్టతల ఉంటే కూడా శరీరంలో హార్మోన్స్ తేడా వస్తుంది. దాంతో జుట్టు రాలే సమస్య ఎక్కువై పోతుంది. అందువలనే చాలామందికి చిన్న వయస్సులోనే జుట్టు రాలడం మొదలవుతుంది. ఒత్తిడి, ఆలోచన ఎక్కువగా ఉన్నా కూడా.. జుట్టు రాలిపోతుంది. కనుక ఒత్తిడిని తగ్గించుకోవడం ఎంతో మేలు చేస్తుంది.
కాలుష్యం వలన జుట్టు పొడిగా మారడం జరుగుతుంది. తద్వారా జుట్టుకు కావలసిన పోషకాలు అందక, అవసరం లేని రసాయనాలు అడ్డుపడడం వలన జుట్టు రాలిపోతుంది. కనుక కాలుష్యం నుండి జుట్టును కాపాడుకోండి.