సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (13:21 IST)

ఈ 3 చిట్కాలు పాటిస్తే.. తెల్ల జుట్టు?

నేటి తరుణంలో చాలామందికి చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. దీని కారణంగా బయటకు వెళ్ళాలంటే కూడా చాలా బాధగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నారా.. కొన్ని వంటింటి చిట్కాలు పాటించి చూడండి.. 
 
1. ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలగా కట్ చేసుకుని మెత్తని పేస్ట్‌లా చేసి జుట్టు రాసుకోవాలి. ముఖ్యంగా మాడుకు పట్టించి పూర్తిగా ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారంలోని రెండుసార్లు చేస్తే తెల్ల రాదు. ఒకవేళ ఉన్నా నల్లగా మారిపోతాయి.
 
2. నువ్వులను మెత్తగా నూరి అందులో ఆయిల్ నూనె వేసి కలిపి జుట్టుకు పూతలా పట్టించాలి. ఈ పేస్ట్‌ని కొన్ని వారాల పాటు మాడుకు రాసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు నల్లగా మారుతుంది.
 
3. కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం పిండి దాన్ని మాడుకు రాసుకుంటే తెల్ల వెంట్రుకల మీద ఇది ప్రభావం చూపుతుంది. శిరోజాలను అందంగా, కాంతివంతగా చేస్తుంది.