శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : మంగళవారం, 25 డిశెంబరు 2018 (12:15 IST)

దానిమ్మతో ప్యాక్ వేసుకుంటే..?

చలికాలం వచ్చిందంటే.. ముఖం పొడిబారడం, నిద్రలేమి వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. వీటి కారణంగా అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా చర్మ రక్షణ కోసం ఈ చిట్కాలు పాటిస్తే ప్రకాశవంతమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చును. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం..
 
దానిమ్మ ఫేస్‌ప్యాక్:
దానిమ్మలోని గింజలను మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో స్పూన్ తేనె, కొద్దిగా పసుపు కలిపి ముఖానికి, మెడకు పట్టించాలి. ఈ ప్యాక్ బాగా ఆరిన తరువాత రోజ్ వాటర్ ముఖానికి రాసుకోవాలి. ఆపై 5 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే.. ముఖం మృదువుగా, తాజాగా మారుతుంది.
 
టమాటో ఫేస్‌ప్యాక్:
ఈ చలికాలం కారణంగా గాలిలో తేమ ఎక్కువగా ఉండదు. దాంతో చర్మం పొడిబారుతుంది. ఈ పొడిబారిన చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా మార్చాలంటే.. ఏం చేయాలో చూద్దాం.. ఒక్క టమాటోను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పేస్ట్‌లా చేయాలి. ఇలా చేసిన పేస్ట్‌లో 2 స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేయాలి. అరగంటపాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే.. పొడిబారిన చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
 
తేనె ఫేస్‌ప్యాక్:
చర్మంపై మృతుకణాలను తొలగించేందుకు తేనె చాలా ఉపయోగపడుతుంది. ఎలాగంటే.. 3 స్పూన్ల తేనెలో టీస్పూన్ పెరుగు, కొద్దిగా అరటిపండు గుజ్జు వేసి మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే.. ముఖం కోమలంగా మారుతుంది.