శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : సోమవారం, 24 డిశెంబరు 2018 (14:25 IST)

జుట్టు రాలకుండా ఉండేందుకు ఈ సూపర్ ఫుడ్స్...

సాధారణంగా జుట్టు రాలడం సరైన ఆహారం తీసుకోకపోవడం ద్వారానే ఏర్పడుతుంది. అంతేకాదు.. విటమిన్ల లోపం, జన్యుపరమైన కారణాలు, అధిక ఒత్తిడి, రక్త ప్రసరణ సరిగా లేకపోవుట, అపరిశుభ్రమైన చర్మం కారణంగా కూడా జుట్టు రాలిపోతుంది. అలాంటప్పుడు నిరాశ చెందకుండా జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు సరైన ఆహారం తీసుకుంటున్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. ఈ క్రమంలో జుట్టు రాలకుండా ఉండేందుకు ఈ సిక్స్ సూపర్ ఫుడ్స్ తీసుకోండి. అవేంటంటే..
 
1. రోజూ ఒక కప్పు మొలకెత్తిన పప్పు ధాన్యాలను తీసుకోవాలి. 
 
2. జుట్టుకు పోషణ అవసరం. అందుకు మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీరు వంటి జ్యూస్‌లను రోజుకు రెండు సార్లైనా తీసుకోవాలి. అలాగే ప్రతిరోజూ కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగాలి.
 
3. మహిళలు ఉసిరికాయతో తయారు చేసిన నూనెను జుట్టుకు ఉపయోగిస్తే నునుపైన, మృదువైన జుట్టును పొందవచ్చు. 
 
4. ప్రోటీన్స్ కోసం చికెన్, గుడ్డు ప్రతి రోజూ తినాలి.
 
5. ప్రతి రోజూ టీ, కాఫీలను తీసుకోవడం తగ్గించండి.
 
6. రోజూ రాత్రి నీటిలో 5 బాదం పప్పులను నానబెట్టి ఉదయం దాని తొక్కలు తీసి తింటే హెయిర్ ఫాల్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు.