ఇంట్లో నటరాజ స్వామి విగ్రహాన్ని వుంచకుండా వుండటమే మంచిదని వాస్తు నిపుణులు చెప్తున్నారు. నటరాజ స్వామి నాట్యం గొప్ప కళే అయినప్పటికీ.. అందులో మరో కోణం వుందని గమనించాలి. నటరాజ స్వామిగా శివుడు చేసేది ప్రళయ తాండవం. ఆ ప్రళయ తాండవానికి సంబంధించిన విగ్రహాలు ఇంట్లో వుండకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
అదేవిధంగా తాజ్‌మహల్ ఇమేజ్‌లు, బొమ్మలు ఇంట్లో వుంచకూడదు. తాజ్‌మహల్ ప్రేమకు చిహ్నం అయినప్పటికీ.. అది ముంతాజ్ సమాధి స్థానం కావడంతో.. సమాధి తాలూకూ నమూనాలు ఇంట్లో వుంచుకోకూడదని వాస్తు నిపుణులు చెప్తున్నారు. ఇంకా చైనా ఫెంగ్‌షుయ్ ప్రకారం.. తాజ్‌మహల్‌ను చూసి రావడమే ఉత్తమమని.. ఇంటికి ఆ బొమ్మలను తేవడం సరికాదు. అలాంటివి ఇంట్లో వుంటే నిరాశ, నిస్పృహలు పెరిగే అవకాశాలున్నట్లు ఫెంగ్‌షుయ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే ఫెంగ్‌షుయ్ ప్రకారం.. ఇంట్లో ముళ్లు వుండే మొక్కలు వుండకూడదు
తెల్లటి జిగురు కారే మొక్కలు కూడా ఇంట్లో వుంచకూడదు. అలా వుంటే నెగటివ్ ఫలితాలు ఖాయం.
వీటితో పాటు ప్లాస్టిక్ పువ్వులు, కృత్రిమ రకానికి చెందిన పువ్వులు ఇంట్లో వుండకూడదు
జీవం లేని, వాసన లేని పువ్వులు, మొక్కలు ఇంట్లో అస్సలు వుంచకపోవడం మంచిది.
విరిగిపోయిన చెక్క వస్తువులు, పూల కుండీలు, పాత్రలు ఇంట్లో పెట్టకపోవడం మంచిది.
ముఖ్యంగా మంచం కింద వస్తువులు పెట్టకూడదు.. మంచం కింద నానా రకాల వస్తువులను పెట్టడం పూర్తిగా మానేయాలి. ముఖ్యంగా చెప్పుల్ని మంచం కింద అస్సలు పెట్టకూడదని ఫెంగ్‌షుయ్ చెప్తోంది. మంచం కింద నిద్రించే సమయంలో ఆ వస్తువుల ప్రభావం మెదడుపై పడుతుందని వారు చెప్తున్నారు.
పాములు, గాడిదలు, గ్రద్ధలు, గబ్బిలాలు, తోడేళ్లు, పావురాళ్లు, పందులు వంటి జంతువులు, పక్షుల ఫోటోలు ఇంట్లో వుండకూడదు. భార్యాభర్తల ఫోటోల పక్కన ఒంటరి పక్షుల బొమ్మలు, సీనరీలు పెట్టకూడదు.
క్రూర జంతువుల ఫోటోలను ఇంట్లో వుంచకపోవడం శ్రేయస్కరం.
విషాధ అర్థాన్నిచ్చే ఫోటోలను ఇంట్లో పెట్టకూడదు.
రామాయణ, మహాభారత కథల్లోని యుద్ధానికి సంబంధించిన ఫోటోలు ఇంట్లో వుంచరాదు. రామాయణ, మహాభారతల్లోని శుభకరమైన దృశ్యాలు వుండవచ్చు. శ్రీరామా పట్టాభిషేకం వంటివి ఇంట్లో వుంచవచ్చు.
ఇక ఫౌంటైన్లు నీటి ప్రవాహాన్ని సూచిస్తాయి. అందుచేత వాటిని ఇంట్లో వుంచి నీటి ప్రవాహం తరహాలో డబ్బు ప్రవాహంలా వెళ్ళిపోతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెప్తున్నారు.
మునిగిపోయిన నావ ఫోటోలు అస్సలు ఇంట్లో లేకుండా చూసుకోవాలి. ఇలా చేస్తే నెగటివ్ ఫలితాలను దూరం చేసుకోవడం సులభమని.. పాజిటివ్ శక్తిని ఇంట్లోకి ఆహ్వానించినట్లవుతుందని.. ఫెంగ్‌షుయ్, వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.