శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By
Last Updated : శనివారం, 22 డిశెంబరు 2018 (14:05 IST)

డిప్రెషన్‌ తొలగించాలంటే.. ఇలా చేయండి..?

పాపీస్ పువ్వులు:
ఈ పువ్వులను అమెరికాలో ఎక్కువగా వాడుతుంటారు. ఈ పాపీస్ పువ్వులు అక్కడి నుండే మన దేశానికి దిగుమతి అవుతాయి. ఈ పువ్వులు చూడడానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని ఇంట్లో, ఆఫీస్సుల్లో టెబుల్ మీద పెట్టుకుంటే బాగుంటుంది. ఈ పువ్వులు ఎరుపు, తెలుపు, నారింజ్, గులాబీ, పసుపు, వంకాయ రంగుల్లో ఉంటాయి. 
 
పాయిన్ సెట్టియా పువ్వులు:
సాధారణంగా చాలామంది పుట్టినరోజు, పెళ్లి ఫంక్షన్స్‌కు వెళ్లేటప్పుడు బొకేల్లోగల పువ్వులు ఉండే వాటినే బహుమతిగా ఇస్తారు. అలానే ఈ పాయిన్ సెట్టియా పువ్వులను కూడా బహుమతిగా ఇవ్వొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే.. ఈ పువ్వులను క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల్లో ఎక్కువగా ఇస్తుంటారు. ఈ పువ్వులు ఎరుపు, వంకాయ, నారింజ రంగులో దొరుకుతాయి. ఈ పువ్వులను బహుమతితే కాదు.. అలంకరణకు కూడా వాడుకోవచ్చు.
 
వ్యాక్స్ పువ్వులు:
ఈ పువ్వులు చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. పైగా వీటి వాసన చాలా బాగుంటుంది. మైండ్ డిప్రెషన్‌గా ఉన్నప్పుడు ఈ పువ్వుల వాసన పీల్చుకుంటే చాలు.. మిమ్మల్ని ప్రశాంతమైన వాతావరణంలో ఉండేలా చేస్తాయి. వీటిని ఇంటి డెకరేషన్‌కు పెడితే బాగుంటుంది.