కీరా ముక్కతో మర్దన చేసుకుంటే..?

Last Updated: శుక్రవారం, 21 డిశెంబరు 2018 (18:13 IST)
అందమైన పెదాలు మంచి ఆరోగ్యానికి చిహ్నాలని చెప్పవచ్చు. అందుకు పెదాలు తడిగా ఉండాలి. లేదంటే.. ఇది సాధ్యం కాదని చెప్తున్నారు. పెదాలు మృదువుగా, అందంగా కనిపించాలంటే.. ఏం చేయాలో పరిశీలిద్దాం..
 
1. పెదాలు తడిగా లేనందుకు కారణం ఆ ప్రాంతాల్లో నూనె గ్రంధులేవీ ఉండనందు వలన అవి తరచు పొడిగా మారుతుంటాయి. అయితే చలిలో పెదాలకు తడి అందక చర్మం పొడిగా మారి చాలా చోట్ల పగుళ్లు ఏర్పడడం, చిట్లిపోవడం జరుగుతుంది. 
 
2. కీరా ముక్కను పెదాలపై రాయడం వలన పెదాలు మృదువుగా ఉంటాయి. పెదాలు చిట్లిపోతే తడిగా ఉండేందుకు నాలికతో తడిచేసుకోవద్దు. అలా చేయడం వల్ల తాత్కాలిక ఉపశమనం ఉంటుంది. కానీ తడి ఆరిన తర్వాత నొప్పి ఎక్కువవుతుంది.
 
3. రోజుకు కనీసం 10 గ్లాసుల నీరు తాగాలి. చవకరకం లిప్‌స్టిక్స్ వాడవద్దు. పెట్రోలియం జెల్లీని రాసుకోవాలి. విటమిన్ ఇ ఆయింట్‌మెంట్ రాసుకుంటే పెదాల పగుళ్లు మానుతాయి.
 
4. రసాన్ని పెదాలకు పూయడం వలన కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. రాత్రుళ్లు పడుకునే ముందు పెదాలకు నెయ్యి రాస్తే.. ఉదయానికంతా పెదాలు మృదువుగా, మెరుస్తూ కనిపిస్తాయి.దీనిపై మరింత చదవండి :