గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : గురువారం, 20 డిశెంబరు 2018 (10:55 IST)

ఒకే వారంలో బొజ్జను తగ్గించే జ్యూస్.. ఇదే..?

ఒకేవారం బొజ్జను తగ్గించాలంటే.. ఈ జ్యూస్‌ తాగాలి. పరగడుపున ఈ జ్యూస్ తాగడం ద్వారా బొజ్జ ఇట్టే తగ్గిపోతుంది. 
 
కావలసిన పదార్థాలు
కీరదోస కాయలు - రెండు
నిమ్మకాయలు- 2
పుదీనా ఆకులు - గుప్పెడు 
అల్లం తురుము - రెండు టేబుల్ స్పూన్లు 
నీరు - మూడు గ్లాసులు 
 
తయారీ విధానం
ముందుగా కీరదోస కాయలను, నిమ్మకాయలను గుండ్రంగా కట్ చేసుకుని పక్కనబెట్టుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయను బౌల్‌లో పిండుకుని రసం తీసుకోవాలి. ఈ నిమ్మరసంతో పుదీనా ఆకులను, నిమ్మ, కీరదోస ముక్కలను చేర్చాలి. తర్వాత మూడుగ్లాసుల నీటిని చేర్చాలి. ఇందులోనే అల్లం తురుమును చేర్చుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి.. 24 గంటల పాటు పక్కనబెట్టేయాలి. రోజూ పరగడుపున తాగాలనుకునేవారు.. ఈ నీటిని రాత్రి పూట తయారు చేసుకోవచ్చు. ఇలా వారం రోజులు చేస్తే తప్పకుండా బొజ్జ కరిగిపోవడం ఖాయమని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.