టూత్‌పేస్ట్‌లో వంటసోడా కలిపి అక్కడ రాసుకుంటే..?
చాలామందికి పెదాలు నల్లగా ఉంటాయి. వారు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆ పెదాలు మాత్రం రంగు మారనే మారవు. ఈ సమస్య మహిళలకే ఎక్కువగా ఉంటుంది. దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతుంటారు. అందుకు చిట్కాలు తెలుసుకుంటే.. పెదాలను గులాబీ రంగుల్లో మార్చొచ్చని బ్యూటీషన్లు చెబుతున్నారు.
1. మీరు ప్రతిరోజూ పళ్లు తోముకునే టూత్‌పేస్ట్‌ను పెదాలు రాసుకోవాలి. ఇప్పుడు టూత్ బ్రష్‌తో పెదాలను రుద్దుకోవాలి. ఇలా నెలరోజుల పాటు క్రమంగా చేస్తే పెదాలు గులాబీ రంగుల్లో అందంగా తయారవుతాయి.
2. సాధారణంగా ప్రతీ స్త్రీ ముఖానికి పసుపు రాసుకుంటుంది. ఈ పసుపు అందాన్ని రెట్టింపు చేస్తుంది. కానీ, చేతి గోర్లను మాత్రం చెడిపేస్తుంది. గోర్ల మధ్యలో పసుపుగా.. వాటిని చూడడానికే విసుగుగా ఉంటుంది. దీనిని ఎంత శుభ్రం చేసినా పోలేదంటే.. టూత్‌పేస్ట్‌ను గోర్లకు రాసుకుని కాసేపు అలానే ఉంచుకోవాలి. ఆ తరువాత మెత్తని గుడ్డతో తుడుచుకుంటే గోర్లు ముందు ఎలా ఉన్నాయో అలా మారుతాయి.
3. మహిళలకు శరీర వేడి కారణంగా ముఖంపై మొటిమలు విపరీతంగా వస్తుంటాయి. వాటిని తొలగించాలంటే.. కలబంద గుజ్జులో కొద్దిగా టూత్‌పేస్ట్ కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట పాటు అలానే ఉంచి ఆ తరువాత కడుక్కుంటే.. మొటిమలు పోతాయి. ఇలా వారం పాటు చేస్తే తప్పక ఫలితం ఉంటుంది.
4. ముక్కుపై నల్లటి వలయాలు, మచ్చలు తొలగించాలంటే.. టూత్‌పేస్ట్‌లో స్పూన్ వంటసోడా కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ముక్కుకు రాసుకుని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా మూడురోజుల పాటు చేస్తే నల్లటి ఛారలు పోతాయి.
5. జుట్టు రాలిపోతుందని బాధపడుతున్నారా.. అయితే ఇలా చేయండి.. అల్లం రసంలో కొద్దిగా ఉల్లిపాయ రసం కలిపి జుట్టుకు పూతలా పట్టించాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా నెలరోజుల పాటు వారంలో ఒక్కసారి చేసిన జుట్టు రాలకుండా ఉంటుంది.