Dharma Sangrah
✕

కొత్తిమీరతో మెరిసే అందాన్ని మీ సొంతం చేసుకోండి (video)

Updated: శుక్రవారం, 22 మే 2020 (19:24 IST)
మన వంటలకు మాత్రమే కాదు అందానికి కూడా కొత్తిమీర సొగసులను అద్దుతుంది. కొత్తిమీరలోని యాంటీ బ్యాక్టిరియల్‌, యాంటీ సెప్టిక్‌ గుణాలు చర్మానికి కాంతినివ్వడంతో పాటు చర్మంపై వచ్చే ముడతలను పోగొడతాయి. అందానికి మెరుగులద్దడంలో కొత్తిమీర ఏ విధంగా పనికొస్తుందో చూద్దాం.
 
పెదవులు తరచుగా ఆరిపోతూ, వాటిపై పొరలు (మృతకణాలు) ఏర్పడుతుంటాయి. దీనికి పరిష్కారంగా కొత్తిమీర పేస్ట్‌లో నిమ్మరసాన్ని కలిపి ప్రతిరోజూ పెదవులకు రాస్తూ ఉన్నట్లయితే, మీ పెదవులు అందంగా తయారవుతాయి.  ఆ సమస్య లేకుండా ఉండాలంటే.. కొత్తిమీర పేస్టును పెదాలకు రాయండి. కొత్తిమీర పేస్టునులో కాస్త నిమ్మ రసం వేయండి. రెండిటినీ బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని మీ పెదవులకు పూయండి. ఇలా రోజూ చేస్తుంటే.. మీ పెదాలు అందంగా మారిపోతాయి.
 
కొత్తిమీర పేస్ట్‌లో కలబంద గుజ్జును కలిపి ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి, ఇలా చేయడం వలన చిన్న వయస్సులోనే ముఖంపై మడతలు రాకుండా నివారించవచ్చు. కాలుష్యం కారణంగా చర్మంపై దుమ్ము పేరుకుపోయి, ముఖంపై ముడతలు రావడం మరికొన్నిసార్లు చర్మ క్యాన్సర్‌ల వంటి వాటికి దారితీసే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు కొత్తిమీర పేస్ట్‌లో కాస్త టమోటా గుజ్జు, ముల్తానీ మట్టి, నిమ్మరసం కలిపి, ముఖానికి రాసుకోండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేయండి. క్రమంగా ఇలా చేస్తూ ఉంటే, ఈ సమస్య తగ్గుతుంది.
 
 

అన్నీ చూడండి

మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోతే వీటో అధికారంతో బిల్లులన్నింటినీ తిరస్కరిస్తాను : డోనాల్డ్ ట్రంప్

మురసు తుఫాను ఎఫెక్ట్ .. లోతట్టు ప్రాంతాలను తరలించండి : పవన్ కళ్యాణ్

మురసు తుఫాను ఎఫెక్ట్ : కోస్తాంధ్రలో జోరు వర్షాలు

Borabanda: ఐదేళ్ల బాలుడిని హత్య చేసిన తండ్రి.. కారణం ఏంటి?

తెలంగాణలో తగ్గిన సైబర్ నేరాలు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

అందరినీ సంతృప్తి పరచాలంటే ఐస్‌క్రీమ్స్ అమ్ముకోవాల్సిందే : ఏఆర్ రెహ్మాన్

Amitabh Bachchan's Bulletproof glass: జల్సాలో రక్షణ గాజు ఆవరణ నుండి అభివాదం చేసిన అమితాబ్ బచ్చన్

Ajit Kumar’s daredevil ఫ అజిత్ కుమార్ డేర్‌డెవిల్ చిత్రం షూటింగ్ అప్ డేట్

Salman Khan: మాన్‌స్టర్ టీమ్ తో చర్చిస్తూ అప్ డేట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి

అమితాబ్‌కు ప్రాణభయం - తొలిసారి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ స్క్రీన్‌లో ఫ్యాన్స్‌కు అభివాదం

తర్వాతి కథనం
Show comments