వేసవిలో దోసకాయను మరిచికోకూడదట..
వేసవిలో దోసకాయను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. దోసకాయలో ముప్పావు శాతం నీరు వుంటుంది. విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. వేసవిలో శరీరాన్ని చల్లబరుచుకోవడానికి కార్బోనేటేడ్ ద్రావణాల కన్నా, దోసకాయ తినటం మంచిది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
మధుమేహంతో బాధపడేవారు దోసకాయ రసం తాగితే మంచి ఫలితాలు అందుతాయి. శరీరంలో కొవ్వు పదార్థాలను తగ్గించే స్టేరాల్ మూలకం దోసకాయలో ఉంటుంది. దీంతో సులువుగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. దోసకాయ తింటే చర్మ సమస్యలు, ర్యాషెస్ తగ్గుతాయి. ఇందులో చర్మ ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.
దోసకాయలో యాంటీ-ఇంఫ్లమేటరీ గుణాలు ఉన్నందున కంటి వ్యాధులను తగ్గించటమే కాకుండా, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దోసకాయ ముక్కలను 20 నిమిషాల పాటు కళ్ళపై ఉంచటం వల్ల మంచి ఉపశమనాన్ని పొందవచ్చు. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో ఉంచే హార్మోన్ దోసకాయలో పుష్కలంగా వుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.