మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2020 (19:26 IST)

సబ్జా గింజలను నీళ్లల్లో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తాగితే?

Sabja Seeds
వేసవిలో ఆరోగ్యానికి సబ్జా గింజలు ఎంతగానో మేలు చేస్తాయి. సబ్జా గింజలను తీసుకుంటే.. వేసవిలో ఉష్ట తాపాన్ని దూరం చేసుకోవచ్చు. అంతేగాకుండా సబ్జా గింజలను నీటిలో వేసి తాగడం ద్వారా శరీరంలోని వ్యర్థాలన్నీ తొలగిపోతాయి. ఈ సబ్జా గింజలు వేసవిలో యాంటీ బయోటిక్‌లా పనిచేస్తాయి. సబ్జా గింజలను గంటల పాటు లేదా రెండు గంటల పాటు నీటిలో వేసి వుంచి.. ఆ నీటిని సేవించడం ద్వారా శరీరంలో పేరుకున్న వ్యర్థాలు తొలగిపోతాయి. 
 
ఈ నీళ్లు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్‌ రాకుండా చూడడంతో పాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది. ఈ నీటిని రాత్రి పూట తాగడం వల్ల మరునాటికి శరీరంలో పేరుకున్న వ్యర్థాలు తొలగిపోతాయి. వేసవిలో ఏర్పడే చర్మ సమస్యలను సబ్జా గింజలు దూరం చేస్తాయి. 
 
ఇంకా చర్మ సమస్యలు రాకుండా వుండాలంటే.. సబ్జా గింజలను నీళ్లల్లో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది. అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ప్రయోజనముంటుంది. గ్లాసుడు నీళ్లలో సబ్జా గింజల గుజ్జు వేసి రోజుకు మూడు లేక నాలుగు సార్లు ఇచ్చినా ఫలితముంటుంది. వీటి గుజ్జును పైనాపిల్‌, ఆపిల్‌, ద్రాక్ష రసాల్లో కలిపి పిల్లల చేత తాగిస్తే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు.
 
గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు సబ్జా గింజల్ని నీళ్ళలో నానబెట్టి తిన్నా, తాగినా ఫలితం ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టిన సబ్జాలకు అల్లం రసం, తేనె కలిపి తాగితే, శ్వాసకోస వ్యాధులు తగ్గుముఖం పడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.